Acharya Twitter Review: తండ్రీకొడుకులు అదరగొట్టారు.. ఆచార్య ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది..

మెగా అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న 'ఆచార్య' సినిమా వచ్చేసింది. సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29 (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Acharya Twitter Review: తండ్రీకొడుకులు అదరగొట్టారు.. ఆచార్య ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది..
Acharya

Updated on: Apr 29, 2022 | 10:44 AM

మెగా అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న ‘ఆచార్య’ సినిమా వచ్చేసింది. సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29 (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిరంజీవి( Chiranjeevi), చరణ్( Ram Charan) కలిసి నటించిన ఆచార్య సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా కనిపించింది. మొదటి నుంచి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే చాట్ బస్టర్స్ గా నిలిచాయి. సైరా సినిమా తర్వాత మెగాస్టార్.. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ చేస్తున్న సినిమా కాబట్టి మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం వస్తున్న సినిమాలు 100 కోట్ల మార్క్ ను అవలీలగా క్రాస్ చేస్తున్నాయి. మరి ఈ సినిమా కూడా భారీ హిట్ అనుకుంటుందేమో చూడాలి. ఇక ఈ సినిమా పై ఇప్పటికే తమ రివ్యూలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు ప్రేక్షకులు.

మరిన్ని ఇక్కడ చదవండి 

Hindi language Row: దేశవ్యాప్తంగా రాజుకంటున్న భాషా వివాదం.. పులుముకుంటున్న రాజకీయరంగు!

Richa Gangopadhyay : పెళ్లితర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మిర్చి బ్యూటీ.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

Nandamuri Balakrishna: నో గ్యాప్ అంటున్న నటసింహం.. స్పీడ్ పెంచిన బాలయ్య.. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్‌తో బిజీ బిజీ