Acharya Movie: ఆచార్యలో రామ్ చరణ్ సిద్ద పాత్ర ఇదేనంటూ టాక్.. మూవీకోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూపు..

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించనున్న..

Acharya Movie: ఆచార్యలో రామ్ చరణ్ సిద్ద పాత్ర ఇదేనంటూ టాక్.. మూవీకోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూపు..
Acharya Moive

Updated on: Jan 01, 2022 | 6:34 PM

Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. ‘సిద్ధ’ అనే పాత్రలో చరణ్‌ సందడి చేయనున్నాడు. ఈ నేపథ్యంలో తండ్రీకొడుకులను ఒకే ఫ్రేమ్‌లో చూసేందుకు సినీ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. అందుకు తగ్గట్లుగానే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి.

ఇప్పటి వరకూ తండ్రి తనయుడు ఇద్దరూ ఒకరి సినిమాల్లో ఒకరు సాంగ్స్ లో ఒక సన్నివేశంలో ఇలా కనిపించి ఫ్యాన్స్  ను మురిపించి అలా మాయమయ్యేవారు. అయితే ఆచార్య మూవీలో మాత్రం రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తూ సినిమాకు అదనపు హంగులను తెచ్చాడు. అయితే ‘ఆచార్య’ సినిమాలో చరణ్‌ ఎంతసేపు ఉంటాడనే చర్చ తాజాగా ఆసక్తికరంగా మారింది. సోషల్‌ మీడియాలోనూ దీనికి సంబంధించి పలు రకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే లేటెస్ట్‌ అప్‌డేట్‌ ప్రకారం సినిమాలో మెగా పవర్‌స్టార్‌ పాత్ర నిడివి 45 నిమిషాలకు పైగానే ఉంటుందట. ఫస్టాఫ్‌ చివర్లో చరణ్‌ ఎంట్రీ ఇస్తాడని, సెకండాఫ్‌లో దాదాపు 40 నిమిషాల వరకు ఈ మెగా హీరో పాత్ర ఉంటుందని ఇండస్ట్రీలో టాక్.

ఇక దాంతో పాటే చెర్రీ క్యారెక్టర్ పై మరో రూమర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో చెర్రీ.. ఆచార్య మెగాస్టార్ చిరంజీవికి అంగరక్షకుడిగా ఉంటాడనే టాక్ ప్రస్తుతం అంతటా వినిపిస్తోంది. మరి ఈ విషయం పై క్లారిటీ రావాలంటే మేకర్స్ రంగంలోకి దిగాల్సిందే.!

Also Read: పూజకే కాదు..అనేక వ్యాధులను నయంచేనే గుణం బిళ్ళ గన్నేరు సొంతం

అమ్మ ఆదిపరాశక్తి ఒడిలో బాల మురుగన్.. కాలక్రమంలో సినీ పరిశ్రమలో నెంబర్ 1 హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..