
మెగాస్టార్ చిరంజీవి… చిత్రపరిశ్రమలో ఓ సంచలనం. ఇక రీఎంట్రీ తర్వాత చిరు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మెగాస్టార్‌తో సినిమా చేసేందుకు దర్శకులు పోటీ పడుతున్నారు. రేపు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన తదుపరి సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వరుసగా విడుదలవుతున్నాయి. ప్రస్తుతం చిరు.. డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో లూసీఫర్ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ సినిమా లూసీఫర్ తెలుగు రీమేక్‌కు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు గాడ్ ఫాదర్ మూవీ మోషన్ పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్. అందులో చిరుని వెనకాల నుంచి చూపిస్తూ.. సినిమా టైటిల్ గాడ్ ఫాదర్ కనిపిస్తుంది. ఇక ఈ మోషన్ పోస్టర్‌కు బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో మూవీపై ఇప్పుడే అభిమానులు ఆసక్తిని పెంచేశారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం చిరు.. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఇందుల కాజల్ హీరోయిన్గా నటిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా.. రేపు ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ రానున్నట్లుగా తెలుస్తోంది.
Presenting the Motion Poster of Megastar @KChiruTweets‘ #GodFather?https://t.co/ZxzhNobizt @jayam_mohanraja @AlwaysRamCharan #RBChoudary@sureshsrajan @ProducerNVP @KonidelaPro @SuperGoodFilms_ @MusicThaman#Chiru153 #HBDMegaStarChiranjeevi
— Konidela Pro Company (@KonidelaPro) August 21, 2021
Also Read: Megastar Chiranjeevi: చిరంజీవి బర్త్ డే ట్రీట్ వచ్చేసింది.. టైటిల్ పోస్టర్ రిలీజ్..
Manchu Manoj: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంచు మనోజ్, లక్ష్మీ.. ఆసక్తికర విషయాలు చెప్పిన హీరో..
Nallennai chitra: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటి మృతి.. ప్రముఖుల సంతాపం..