Chiranjeevi: మన శంకరవరప్రసాద్ ఈవెంట్‌లో చిరంజీవి ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా? బ్లేజర్ రేటు కూడా లక్షల్లోనే..

మన శంకర వరప్రసాద్ గారు' ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి అల్ట్రా స్టైలిష్ లుక్ లో సందడి చేశారు. ముఖ్యంగా ఈ మెగా ఈవెంట్ లో ఆయన ధరించిన బ్లేజర్, చేతికి ఉన్న లగ్జరీ వాచ్ అందరి దృష్టిని ఆకర్షించాయి.

Chiranjeevi: మన శంకరవరప్రసాద్ ఈవెంట్‌లో చిరంజీవి ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా? బ్లేజర్ రేటు కూడా లక్షల్లోనే..
Chiranjeevi

Updated on: Jan 09, 2026 | 9:29 PM

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా మన శంకరవరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో బుధవారం (జనవరి 07) హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. చిరంజీవి, వెంకటేష్ లతో పాటు చిత్ర బృందమంతా ఈ మెగా ఈవెంట్ కు హాజరైంది. కాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించారు. ముఖ్యంగా ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అందరి దృష్టిని ఆకర్షించింది. చూసేందుకు సింపుల్‌గా ఉన్నప్పటికీ… ఆయన ధరించిన బ్లేజర్, చేతికి పెట్టుకున్న వాచ్ రేట్లు తక్కువేమీ కాదని తెలుస్తోంది.

చిరంజీవికి దగ్గర రిస్ట్ వాచ్ కలెక్షన్ బాగానే ఉంది. వీటిని చాలా మందికి గిఫ్ట్ గా కూడా ఇచ్చారు. ఇక ‘మన శంకర వరప్రసాద్ గారు’ వేడుకలో ఆయన రోలెక్స్ వాచ్ ధరించారు. మెగాస్టార్ చేతికి ఉన్న వాచ్ Rolex Daytona మోడల్. దీని ధర సుమారు రూ. 1.89 కోట్ల నుంచి రూ. 2.29 కోట్లు వరకు ఉంటుందని తెలిసింది. ఇక బ్లేజర్ విషయానికి వస్తే.. దాని మీద ‘B’ అనే లోగో కనబడుతుంది. అంటే అది Balmain బ్రాండ్‌కు చెందినదని తెలుస్తోంది. ఈ కంపెనీ బ్లేజర్ రేటు సుమారు రూ. 1,00,000 నుంచి రూ. 2,00,000 వరకు ఉంటాయని సమాచారం. దీంతో వీటి రేటు తెలుసుకున్న నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక ‘మన శంకర వరప్రసాద్ గారు’ విషయానికి వస్తే.. ఇందులో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. అలాగే విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రలో యాక్ట్ చేశారు. వీరితో పాటు కేథరిన్, మురళీధర్ గౌడ్, అభినవ్ గోమఠం తదితరులు కీలక పాత్రలు పోషించారు. భీమ్స్ అందించిన స్వరాలు ఇప్పటికే యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి.

మన శంకర వర ప్రసాద్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.