Ram Charan : నయా లుక్‌తో రచ్చ చేస్తున్న మెగాపవర్ స్టార్.. ఆ సినిమా కోసమేనా..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ తనకంటూ..

Ram Charan : నయా లుక్‌తో రచ్చ చేస్తున్న మెగాపవర్ స్టార్.. ఆ సినిమా కోసమేనా..
Mega Powerstar Ram Charan

Updated on: Feb 19, 2022 | 9:41 AM

Ram Charan : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మెగా పవర్ స్టార్. చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చరణ్ ఆచితూచి సినిమాలను ఎంచుకుంటున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా భారీ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు ఈ చిరుత. చరణ్ కెరీర్ లో నిలిచిపోయే సినిమాగా మగధీర.. చరణ్ రేంజ్ ను ఒక్కసారిగా ఆకాశానికి చేర్చింది. ఆతర్వాత రంగస్థలం సినిమాలో గుబురు గడ్డంతో కనిపించి మెస్మరైజ్ చేశాడు. చిట్టిబాబుగా చరణ్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు దర్శకధీరుడితో ఆర్ఆర్ఆర్ అంటూ సందడి చేయడనికి సిద్దమయ్యాడు ఈ కుర్ర హీరో. సినిమా సినిమాకు డిఫరెంట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న చరణ్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామ రాజుగా ఆకట్టుకోనున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో చరణ్ మేకోవర్ చూసి మెగా ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు.

అలాగే మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య సినిమాలో చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమాలో నక్సలైట్ గా కనిపించనున్నాడు చరణ్. ఇందుకోసం కోర మీసాలతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తాజాగా చరణ్ తన కొత్త లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. వైట్ టీ షర్ట్ – బ్లాక్ ప్యాంటుతో చరణ్ రెట్రో హెయిర్ స్టైల్ లో కనిపించాడు. ఇప్పుడు ఈ లుక్ తెగ వైరల్ అవుతుంది. ఈ  లుక్ ఏ సినిమా కోసం అంటూ అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు. అయితే చరణ్ టాప్ దర్శకుడు శంకర్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. ఈ మూవీలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ లుక్ అందుకోసమే అని కొందరు అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రిలో శరవేగంగా జరుగుతోంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జయరామ్- అంజలి- సునీల్- నవీన్ చంద్ర- శ్రీకాంత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Ram Charan

మరిన్ని ఇక్కడ చదవండి : 

NBK107: మొదలైన బాలయ్య 107వ సినిమా.. సిరిసిల్లలో షూటింగ్ ప్రారంభం..!

Alia Bhatt: అందాలతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతున్న అలియా భట్ లేటెస్ట్ పిక్స్

Malavika Mohanan: పాన్ ఇండియా స్టార్ సరసన ఛాన్స్ దక్కించుకున్న మాస్టర్ బ్యూటీ.?