మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram charan) ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకొని ఇప్పుడు శంకర్ సినిమాతో బిజీ అయ్యాడు. ఆర్ఆర్ఆర్ లో అల్లూరి సీతారామరాజుగా నటించిన చరణ్.. తన నటనతో అభినయంతో ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు టాప్ దర్శకుడు శంకర్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గురించి ఇప్పటికే చాలా వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోందని కొందరు అంటుంటే మరికొందరు ఈ సినిమా సోషల్ మెసేజ్ ఇచ్చే మూవీ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమాలో చరణ్ ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని కూడా టాక్ వినిపించింది. అయితే ఆమధ్య చరణ్ ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతుందో చెప్పేశారు. ఈ సమాజంలో మనల్ని ఇస్పైర్ చేసిన ఎందరో ఆఫీసర్స్ ఆధారంగా నా సినిమా రూపొందుతోందని చరణ్ అన్నారు. దాంతో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ గా వైజాగ్ లో ఒక షెడ్యూల్ ను పూర్తి చేశారు చిత్రయూనిట్. ఆ తరువాత షెడ్యూల్స్ ను హైదరాబాద్ .. మారేడుమిల్లిలో ప్లాన్ చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని దిల్ రాజు ప్లాన్ చేసుకున్నారట. అయితే ఈ సినిమా షూటింగు పార్టు ఇంకా చాలానే మిగిలి ఉండటంవలన సినిమాను వచ్చే వేసవిలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. వచ్చే వేసవిలో ఈ సినిమా సందడి చేయనుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :