AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panja Vaisshnav Tej : పవన్ కళ్యాణ్ దర్శకుడితో ‘పంజా’ వైష్ణవ్ నెక్స్ట్ సినిమా.. ఆ దర్శకుడు ఎవరంటే..

ఒక్క సినిమాతోనే ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. చేసిన మొదటి సినిమానే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. డెబ్యూ మూవీతో 100కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్..

Panja Vaisshnav Tej : పవన్ కళ్యాణ్ దర్శకుడితో 'పంజా' వైష్ణవ్ నెక్స్ట్ సినిమా.. ఆ దర్శకుడు ఎవరంటే..
Vaishnav
Rajeev Rayala
|

Updated on: Sep 15, 2021 | 11:51 AM

Share

Panja Vaisshnav Tej : ఒక్క సినిమాతోనే ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. చేసిన మొదటి సినిమానే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. డెబ్యూ మూవీతో 100కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు.. ఆ హీరో ఎవరో కాదు మెగా హీరో వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో పరిచయం అయిన ఈ కుర్ర హీరో.. తన నటనతో మంచి మార్కులు కొట్టేశాడు. మొదటి సినిమా రిలీజ్‌కు ముందే.. మరో సినిమాను కూడా పూర్తి చేశాడు వైష్ణవ్.. అదే కొండా పొలం. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ ఎవరితో సినిమా చేయబోతున్నాడన్నది ఆసక్తిగా మారింది. ఈ క్రమంలో ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేసిన విష్ణువర్ధన్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు వైష్ణవ్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పంజా సినిమా తెరకెక్కించిన విష్ణువర్ధన్‌తో వైష్ణవ్ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.  విష్ణువర్ధన్ పంజా సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. ఇక పంజా సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆ సినిమాలో విష్ణువర్ధన్ పవన్ చూపించిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పంజా సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న విష్ణువర్ధన్ ఇటీవలే బాలీవుడ్‌లో షేర్షా సినిమాను తెరకెక్కించాడు. ఓఓటీ ద్వారా విడుదల అయిన ఆ దేశ భక్తి సినిమాకు సూపర్ హిట్ టాక్ దక్కింది. ఇక ఇప్పుడు విష్ణు వర్థన్ దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ఒక సినిమా రూపొందబోతుంది. వీరిద్దరి కాంబోలో ఒక సినిమాను చేసేందుకును తెలుగు నిర్మాత ఒకరు ప్రయత్నిస్తున్నారట.  త్వరలో ఈ కాంబో పై క్లారిటీ రానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shyam Singa Roy Movie: శ్యామ్ సింగరాయ్ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడేనా..

Tollywood Drug Case: ఈడీ అధికారుల ముందు హాజరైన ముమైత్ ఖాన్.. ప్రారంభమైన విచారణ..

Love Story : సెన్సార్ పూర్తి చేసుకున్న శేఖర్ కమ్ముల సినిమా.. లవ్ స్టోరీ మూవీ ఎన్నిగంటలంటే..

Follow Us
కారవాన్‌లోనే బోర్డు మీటింగ్.. ఏపీ టూరిజం సరికొత్త ఆలోచన
కారవాన్‌లోనే బోర్డు మీటింగ్.. ఏపీ టూరిజం సరికొత్త ఆలోచన
బూందీ మిక్చర్‌లో కరకరలాడే బల్లి.. స్వీట్‌ షాప్‌పై కేసు, జరిమానా
బూందీ మిక్చర్‌లో కరకరలాడే బల్లి.. స్వీట్‌ షాప్‌పై కేసు, జరిమానా
పిచ్చి పీక్స్.. వ్యూస్ కోసం ట్రైన్‌లో యువకుడు చేసింది చూస్తే..
పిచ్చి పీక్స్.. వ్యూస్ కోసం ట్రైన్‌లో యువకుడు చేసింది చూస్తే..
బ్యాంక్ అకౌంట్లో్ అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ఇబ్బందులే..
బ్యాంక్ అకౌంట్లో్ అంతకంటే ఎక్కువ విత్ డ్రా చేస్తే ఇబ్బందులే..
ఇదేం మ్యాజిక్ భయ్యా.. మన తెలుగోడి స్కిల్‌కు ఎవరైనా ఫిదా..
ఇదేం మ్యాజిక్ భయ్యా.. మన తెలుగోడి స్కిల్‌కు ఎవరైనా ఫిదా..
ఈ నెలలోనే తొలి ఏకాదశి.. వీరికి ఆ రోజున మహర్దశ పట్టబోతోంది..
ఈ నెలలోనే తొలి ఏకాదశి.. వీరికి ఆ రోజున మహర్దశ పట్టబోతోంది..
పూజలో నేలపై కూర్చోవచ్చా? ఆసనం లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది?..
పూజలో నేలపై కూర్చోవచ్చా? ఆసనం లేకుండా పూజ చేస్తే ఏమవుతుంది?..
'Wiproలో లేఆఫ్.. అది దేవుడిచ్చిన వరం' మాజీ ఉద్యోగిని వీడియో వైరల్
'Wiproలో లేఆఫ్.. అది దేవుడిచ్చిన వరం' మాజీ ఉద్యోగిని వీడియో వైరల్
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్..
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్..
Green Tea Vs Black Tea: వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్‌కు ఏది బెస్ట్
Green Tea Vs Black Tea: వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్‌కు ఏది బెస్ట్