Panja Vaishnav Tej: జోరుపెంచిన మెగా హీరో.. రిలీజ్‌కు రెడీ అవుతోన్న ‘రంగవైభవంగా’.. టీజర్ ఎప్పుడంటే

|

Jun 26, 2022 | 7:27 PM

మెగా హీరో వైష్ణవ్ తేజ్(Panja Vaishnav Tej) ఉప్పెన సినిమా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. తొలి సినిమాతోనే 100 కోట్ల మార్క్ ను సాధించాడు వైష్ణవ్ .

Panja Vaishnav Tej: జోరుపెంచిన మెగా హీరో.. రిలీజ్‌కు రెడీ అవుతోన్న రంగవైభవంగా.. టీజర్ ఎప్పుడంటే
Rangarangavaibhavanga
Follow us on

మెగా హీరో వైష్ణవ్ తేజ్(Panja Vaishnav Tej) ఉప్పెన సినిమా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. తొలి సినిమాతోనే 100 కోట్ల మార్క్ ను సాధించాడు వైష్ణవ్. ఆతర్వాత కొండపొలం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నడు. రంగ రంగ వైభవంగా అనే  సినిమాతో రాబోతున్నాడు వైష్ణవ్.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గిరీశాయ ద‌ర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వైష్ణవ్ సరసన కేతికా శ‌ర్మ హీరోయిన్‌ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి రంగ రంగ వైభవంగా సినిమాను జూలై 1 భారీ లెవ‌ల్లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ డైరెక్షన్‌లో ల‌వ్, ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్ క‌ల‌గ‌లిసిన ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ‘రంగ రంగ వైభ‌వంగా’ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమానుంచి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాకు సంబందించిన మొదటి టీజర్ ను ఈ నెల 27వ తేదీన విడుదల చేయబోతున్నారు. AMB సినిమాస్ లో ప్రత్యేకంగా ఉదయం 11 గంటలకు యూట్యూబ్ ద్వారా టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అందమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రయూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి