
రొట్టె విరిగి నేతిలో పడ్డం అంటే ఇదేనేమో. రెండు లక్కీ ఛాన్సులు ఒకేసారి వచ్చి పడ్డంతో తెగ ఇదైపోతున్నారట ఒక మెగా హీరో. మెగా కాంపౌండ్ లోని రెండు జెనరేషన్లను కలిపి చూసే భాగ్యం రెండుసార్లు దక్కుతోంది అని మెగా ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతున్నారు. ఇంతకీ ఆ డబుల్ డోస్ డీటెయిల్స్ ఏంటంటే.. ప్రతిరోజూ పండగే తర్వాత సోలో బతుకే సో బెటర్ అనుకుంటూ సోలో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej ). కానీ ఎన్నో హోప్స్ పెట్టుకున్న రిపబ్లిక్ మూవీ ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. అందుకే.. సోలో ఎఫర్ట్స్ కి చిన్న బ్రేక్ ఇచ్చినట్టున్నారు. మున్ముందు రెండు జాక్ పాట్స్ కొట్టబోతున్నాడు ఇంటిలిజెంట్ హీరో. పవన్ చెయ్యబోయే నెక్స్ట్ రీమేక్ లో తేజ్ పేరే కన్ఫర్మ్ అయింది. తమిళ వెబ్ సంచలనం ‘వినోదయ సితం’కి తెలుగు వెర్షన్ రెడీ చేస్తున్నారు త్రివిక్రమ్. నెక్స్ట్ మంత్ లోనే ఈ సినిమా సెట్స్ మీదికెళ్లే ఛాన్సుంది. మల్టీస్టారర్స్ వైపు బెండ్ అయిన పవర్ స్టార్.. ఈసారి ఆ గోల్డెన్ ఛాన్స్ మేనల్లుడు తేజ్ కిచ్చారట.
మెగాస్టార్ కూడా షార్ట్ కట్లో ఒక స్మాల్ సైజ్ మల్టీస్టారర్ ని ఒకే చేశారు. రీసెంట్ గా రిలీజైన మలయాళ మూవీ బ్రో-డాడీ చిరూ గుడ్ లుక్స్ లో పడింది. స్క్రిప్ట్ డెవలప్ చేసే బాధ్యతల్ని హరీష్ శంకర్ కిచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో మోహన్ లాల్ చేసిన తండ్రి పాత్రలో చిరూ, పృథ్వీరాజ్ చేసిన తనయుడి పాత్రలో తేజ్ నటించే ఛాన్సుంది. ఇలా ఒకే సీజన్లో ఇద్దరు మేనమామలతో కలిసి పెర్ఫామ్ చేసే ఛాన్స్ దక్కించుకోబోతున్నారు సాయి ధరమ్ తేజ్. ఇన్నాళ్లూ మామయ్యల్ని అనుకరించడంతో సరిపెట్టుకుని, ఇప్పుడు ఏకంగా మామయ్యలతో వెండితెరను పంచుకోబోతున్నారు. పనిలోపనిగా తను కూడా విన్నర్ గా నిలబడేలా గట్టిగానే ప్లాన్ చేసుకున్నారు సుప్రీమ్ హీరో.