Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీవితంపై పుస్తకం.. ‘ది రియల్ యోగి’ బుక్ లాంచ్ చేసిన మెగా బ్రదర్ నాగబాబు..

|

Dec 17, 2022 | 7:18 PM

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై యువ రచయిత గణ రాసిన 'ది రియల్ యోగి' బుక్ లాంచ్ ఈవెంట్ శనివారం గ్రాండ్ గా జరిగింది. మెగా బ్రదర్ నాగబాబు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు మెహర్ రమేష్, బాబీ కొల్లి, తనికెళ్ళ భరణి, పుస్తక రచయిత గణ, శ్రీకాంత్ రిష, సాహి సురేష్ శైలా తాళ్లూరి తదితరులు పాల్గొన్నారు.

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీవితంపై పుస్తకం.. ది రియల్ యోగి బుక్ లాంచ్ చేసిన మెగా బ్రదర్ నాగబాబు..
Pawan Kalyan
Follow us on

‘ది రియల్ యోగి’ పుస్తకాన్ని ఒక కామన్ పాయింట్ అఫ్ వ్యూలో కళ్యాణ్ బాబు గురించి రచయిత గణ అద్భుతంగా రాశారు. కళ్యాణ్ బాబు గురించి నేను ఏం అనుకుంటానో దగ్గరదగ్గరగా అలానే రాశాడు గణ. అందుకే ఈ పుసక్తం ఇంకా నచ్చింది” అన్నారు మెగా బ్రదర్ నాగబాబు. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై యువ రచయిత గణ రాసిన ‘ది రియల్ యోగి’ బుక్ లాంచ్ ఈవెంట్ శనివారం గ్రాండ్ గా జరిగింది. మెగా బ్రదర్ నాగబాబు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శకులు మెహర్ రమేష్, బాబీ కొల్లి, తనికెళ్ళ భరణి, పుస్తక రచయిత గణ, శ్రీకాంత్ రిష, సాహి సురేష్ శైలా తాళ్లూరి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ.. ‘ది రియల్ యోగి’ పుస్తకాన్ని చదివాను. రచయిత గణకి అభినందనలు. ఈ పుస్తకం ఏకబిగిన చదించింది. శ్రీకాంత్రిష అద్భుతమైన చిత్రాలు గీశారు. గణ అద్భుతంగా రాశారు. తెలుగులో ఇలాంటి ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఒక కామన్ పాయింట్ అఫ్ వ్యూలో కళ్యాణ్ బాబు గురించి గణ అద్భుతంగా రాశారు. కళ్యాణ్ బాబు గురించి నేను ఏం అనుకుంటానో దగ్గరదగ్గరగా అలానే రాశాడు గణ. అందుకే ఈ పుసక్తం ఇంకా నచ్చింది. కళ్యాణ్ బాబు గ్రేట్ మోటీవెటర్. తన దగ్గర వున్నది ఇచ్చేయడమే కళ్యాణ్ బాబుకి తెలుసు. కళ్యాణ్ బాబు ఆలోచన ధోరణి చిన్నప్పటి నుండే భిన్నంగా వుండేది. సినిమాలకి రాకముందే కెరీర్ ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నావని అన్నయ్య అడిగితే ” క్యాలిటీగా వుండే సినిమాలు ఏడాదికి ఒకటో రెండో సినిమాలు చాలు” అన్నాడు. తను హీరో అయిన తర్వాత కూడా ఇదే పాటిస్తున్నాడు. ఎదుటి వాడి బాధలో వుంటే తను హాయిగా ఉండలేడు. రుద్రవీణ అన్నయ్య చేసిన సూర్యం పాత్ర రియల్ లైఫ్ లో కళ్యాణ్ బాబుది.

‘సంపాదన నాకు తృప్తిని ఇవ్వడం లేదు. ఎదుటి వాడు బాధలో వుంటే నేను సంతోషంగా ఉండలేను’ అని కామన్ మాన్ ప్రొటక్షన్ ఫోర్స్ పెట్టినపుడే చెప్పాడు. అప్పుడు ఏం చెప్పాడో ఇప్పుడూ అదే చెబుతున్నాడు. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడూ అలానే వున్నాడు. మరో నాలుగు నలఫై ఏళ్ల తర్వాత కూడా అలానే ఉంటాడు.. దటీజ్.. పవన్ కళ్యాణ్. తన జీవితం పూలపాన్పు కాదు. తను రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసం కాదు. లంచగొండి తనంతో సామాన్యుడిని ఇబ్బంది పెడుతున్న రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న అవినీతి, లంచగొండి రాజకీయ నాయకుల మీద యుద్ధం చేయడానికి జనసేన పార్టీ పెట్టాడు. పైసా కూడా లేకుండా కట్టుబట్టలతో రోడ్డు మీద నిలబడిపోయే వ్యక్తిత్వం కళ్యాణ్ బాబుది. తన భవిష్యత్ గురించి ఆలోచన వుండదు. ఇవన్నీ ఒక యోగి, మానవుని ఉండాల్సిన లక్షణమా అనవసరం. ఒక మనిషి కళ్యాణ్ బాబు నాకు చాలా నచ్చుతాడు.

ఇవి కూడా చదవండి

కళ్యాణ్ బాబులా వుండాలి కదా.. కానీ నేను అలా ఉండలేకపోతున్నానని చాలాసార్లు అనుకుంటాను. తన పిల్లల పై వున్న ఫిక్సడ్ డిపాజిట్లు అన్నీ తీసేసి జనసేన పార్టీ పెట్టాడు. ప్రజలందరికీ పెద్ద ఎత్తున సేవ చేయాలని రాజకీయాన్ని వేదికగా ఎంచుకున్నాడు. తెలుగులో తను టాప్ హీరో. ఫైనాన్సియల్ గా చూస్తే ఏమీ లేదు. కానీ ఒక మనిషిగా ఎవరూ అందుకోలేనంత ఎత్తులో ఉంటాడు. ఈ పుస్తకంలో గణ, కళ్యాణ్ బాబుని ఎక్కడా గాడ్లీ పర్శన్ గా హైలట్ చేయడానికి ప్రయత్నించలేదు. ఈ పుస్తకం ఎంత హిట్ అవుతుందో లేదో తెలీదు కానీ .. అందరూ ఒకసారి చదవాల్సిన పుస్తకం ఇది” అన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.