ఆమె వల్లే నాకు నీలాంబరి పాత్ర మిస్ అయ్యింది.. ఇన్నాళ్లకు అసలు విషయం చెప్పిన మీనా

1999 తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ తెరకెక్కింది.. ఆతర్వాత తెలుగులోకి డబ్ అయ్యింది. తమిళ సినిమా పడయప్పాను తెలుగులో నరసింహా పేరుతో డబ్ చేశారు. ఈ సినిమాలో శివాజీ గణేశన్ కీలక పాత్రలో నటించారు. అలాగే ఈ సినిమాలో రమ్యకృష్ణ చేసిన పాత్ర సినిమాకే హైలైట్ అని చెప్పాలి. నెగిటివ్ రోల్ లో అద్భుతంగా నటించి మెప్పించారు రమ్యకృష్ణ.

ఆమె వల్లే నాకు నీలాంబరి పాత్ర మిస్ అయ్యింది.. ఇన్నాళ్లకు అసలు విషయం చెప్పిన మీనా
Meena

Updated on: Mar 20, 2024 | 9:05 AM

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన బిగెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ లో నరసింహ ఒకటి. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 1999 తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ తెరకెక్కింది.. ఆతర్వాత తెలుగులోకి డబ్ అయ్యింది. తమిళ సినిమా పడయప్పాను తెలుగులో నరసింహా పేరుతో డబ్ చేశారు. ఈ సినిమాలో శివాజీ గణేశన్ కీలక పాత్రలో నటించారు. అలాగే ఈ సినిమాలో రమ్యకృష్ణ చేసిన పాత్ర సినిమాకే హైలైట్ అని చెప్పాలి. నెగిటివ్ రోల్ లో అద్భుతంగా నటించి మెప్పించారు రమ్యకృష్ణ. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా సౌందర్య నటించారు. ఇక రజినీకాంత్, రమ్యకృష్ణ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల చేత విజిల్స్ కొట్టించాయి.

ఇదిలా ఉంటే రమ్యకృష్ణ చేసిన నీలాంబరి పాత్రలో ముందుగా మరో స్టార్ హీరోయిన్ ను అనుకున్నారట. ఆ హీరోయిన్ మరెవరో కాదు ఒకప్పుడు తన అందచందాలతో మెప్పించిన మీనా. ఈ విషయాన్నీ ఇటీవల తానే స్వయంగా తెలిపారు. బాల నటిగా కెరీర్ మొదలు పెట్టిన మీనా.. ఆ తర్వాత హీరోయిన్ గా మరి సినిమాలు చేసింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది మీనా..

మీనా ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు. కెరీర్ పీక్స్ లో ఉండగానే సాగర్ ను వివాహం చేసుకుంది. ఇటీవలే ఆయన కన్నుమూశారు. భర్త చనిపోయాక ఆమెపై ఎన్నో విమర్శలు వచ్చాయి కానీ వాటిని ఆమె పట్టించుకోలేదు. రెండో పెళ్లి చేసుకుంటుంది అంటూ ఆమెను ట్రోల్ చేసినా కూడా ఆమె వాటిని పట్టించుకోకుండా దైర్యంగా ఉన్నారు. తెలుగులో నేను సూపర్ హిట్ సినిమాలు మిస్ చేసుకున్నా.. నాగార్జున హీరోగా నటించిన నిన్నే పెళ్లాడతా మూవీ నేను మిస్ చేసుకున్నా..డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో నేను చేయలేకపోయాను అని తెలిపారు. నరసింహాలో రమ్యకృష్ణ నీలాంబరి రోల్ కూడా నేను మిస్ చేసుకున్నా అని తెలిపారు మీనా.. అప్పుడు నేను హోమ్లీ పాత్రలు చేస్తున్నాను. పైగా రజినీకాంత్ గారితో చాలా సినిమాలు చేశాను. మా ఇద్దరిది మంచి పెయిర్. నెగిటివ్ రోల్ కావడంతో మా అమ్మ నన్ను ఆ సినిమా చెయ్యొద్దు అని చెప్పారు. కానీ నాకు ఆ పాత్ర బాగా నచ్చింది. ఆతర్వాత సౌందర్య పాత్ర ఆఫర్ చేశారు. కానీ నేను చేస్తే రమ్యకృష్ణ పాత్రే చేస్తా అని చెప్పను అలా ఆ సినిమా మిస్ అయ్యింది అని తెలిపారు మీనా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.