అలేఖ్య చిట్టి పికిల్స్ పై మాస్టర్ చెఫ్ రియాక్షన్.. ఒక్క కిస్ ఏందిరా బాబు అంటూ..

సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి ‘అలేఖ్య చిట్టి పికిల్స్’ సిస్టర్స్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు అయిన ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లకు మిలియన్ల కొద్ది వారికి ఫాలోవర్లు‌ ఉన్నారు. ఆ క్రేజ్ ను ఉపయోగించుకునే గత కొన్నేళ్లుగా పచ్చళ్ల వ్యాపారం చేస్తూ మంచి లాభాలను గడించారు.

అలేఖ్య చిట్టి పికిల్స్ పై మాస్టర్ చెఫ్ రియాక్షన్.. ఒక్క కిస్ ఏందిరా బాబు అంటూ..
Alekhya Chitti Pickles Sist

Updated on: Apr 08, 2025 | 10:42 AM

అలేఖ్య చిట్టి పికిల్స్ .. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇప్పుడు ఇదే పేరు వినిపిస్తుంది. ఇన్ స్టా గ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఒకటే ఆడియో, ఒకటే ట్రోల్స్.. ఎవరు చూసిన అలేఖ్య చిట్టిపికిల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్లు అందరూ అలేఖ్య చిట్టి పికిల్స్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పచ్చళ్లు బిజినెస్ చేస్తూ పాపులర్ అయిన ఈ అక్క చెల్లెళ్లు. సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫాలోవర్స్ ను పెంచుకున్నారు. అయితే ఇంత రేట్లు ఎందుకు అని అడిగినందుకు కస్టమర్స్ ను నోటికొచ్చిన బూతులు తిట్టడం. ఇష్టమొచ్చినట్టు వాగాడంతో ఈ అక్క చెల్లెళ్ళ పై నెటిజన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

పికిల్స్ బాగున్నాయ్.. కానీ ఇంత రేటు ఎందుకు.? అని అడిగిన ఓ కస్టమర్ ను దారుణంగా తిట్టిన ఆడియో ఒకటి లీక్ అయ్యింది. దాంతో నెటిజన్స్ మండిపడ్డారు. అలాగే ఓ అమ్మాయిని కూడా ఇష్టమొచ్చినట్టు తిట్టిన ఆడియో కూడా లీక్ అయ్యింది. దాంతో ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయి. తప్పయింది క్షమించండి అని చెప్పినా కూడా నెటిజన్స్ వదలడం లేదు వదలడం లేదు. ఇక అలేఖ్య చిట్టి పికిల్స్ కు సపోర్ట్ చేసిన నా అన్వేషణను కూడా ట్రోల్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా మాస్టర్ చెఫ్ సంజయ్ తుమ్మ కూడా దీని పై రియాక్ట్ అయ్యాడు. పచ్చళ్లు తినండి బూతులు కాదు అంటూ సలహా ఇచ్చాడు సంజయ్. “చికెన్ బ్రెస్ట్‌లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పచ్చడి షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే నాన్ వెజ్ పికిల్స్ మీరే చేసుకోండి. మీరే తినండి. బూతులు తినకండి. ఒక్క కిస్.. ఒక్క కిస్ ఏందిరా బాబు ఒక్క పీస్… అంటూ సంజయ్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియో పై నెటిజన్స్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.