Master Bharath: యాక్టర్ నుంచి డాక్టర్‌గా! తల్లి చివరి కోరిక తీర్చిన మాస్టర్ భరత్… ఇప్పుడెలా మారిపోయాడో చూశారా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన వారిలో మాస్టర్ భరత్ ఒకడు. సుమారు 80కు పైగా సినిమాల్లో నటించిన అతను ఇప్పుడు పర్సనల్ లైఫ్ పరంగా మరో మైలురాయి అందుకున్నాడు. తన తల్లి చివరి కోరికను తీరుస్తూ..

Master Bharath: యాక్టర్ నుంచి డాక్టర్‌గా! తల్లి చివరి కోరిక తీర్చిన మాస్టర్ భరత్... ఇప్పుడెలా మారిపోయాడో చూశారా?
Master Bharath

Updated on: Oct 09, 2026 | 8:08 PM

ఛైల్డ్ ఆర్టిస్టుగా సుమారు 80కు పైగా సినిమాల్లో నటించాడు భరత్. రెడీ, వెంకీ, ఢీ, కింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, పెదబాబు, ఆనందమానందమాయే, గుడుంబా శంకర్, హ్యాపీ, పోకిరి, అందాల రాముడు, దుబాయ్ శీను, ఏబీసీడీ.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో తనదైన కామెడీ తో తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు భరత్. చిన్నతనంలోనే బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి వంటి ఎందరో స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడీ నటుడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన భరత్ తన నటనా ప్రతిభకు ప్రతీకగా రెండు నంది అవార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సత్తా చాటిన భరత్ ఆ తర్వాత హీరోగానూ మెరిశాడు. యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన ABCD సినిమాలో సెకండ్ హీరోగా కనిపించాడు. ఆ తర్వాత తెలుగులో మరో సినిమాలోనూ కనిపించాడు. అయితే కొంతకాలంగా భరత్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. సోషల్ మీడియాలోనూ కనిపించడం లేదు. అయితే గతేడాది భరత్ వ్యక్తిగత జీవితంలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. 2025 మే 19న భరత్ మాతృమూర్తి కమలాసిని గుండెపోటుతో కన్నుమూశారు.

 

గతేడాది తల్లి హఠాన్మరణం..

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఛైల్డ్ ఆర్టిస్టుగా చిన్న వయసులోనే బోలెడంత స్టార్ డమ్ చూశాడు భరత్. అయితే ఇప్పుడీ నటుడు తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి మరో మైలురాయి అందుకున్నాడట. అదేందంటే..భరత్ తన ఎంబీబీఎస్ విద్యను విజయవంతంగా పూర్తి చేశారట. సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత భరత్ చదువుపై బాగా దృష్టి పెట్టాడట. బాగా చదివి మెడిసిన్ సీటు కూడా సాధించారట. ఇప్పుడు చెన్నైలో మెడిసిన్ చదువును కూడా భరత్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. చిన్నప్పటి నుంచి చదువులోనూ చురుగ్గా ఉండే భరత్, తాను డాక్టర్ కావాలనేది తన తల్లి కమలాసిని కోరిక అని గతంలో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇప్పుడు ఆమె ఆశయానికి అనుగుణంగానే రాత్రింబవళ్లు కష్టపడి చదివి మెడికల్ కోర్సు పూర్తి చేశాడట నటుడు. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ విషయం తెలుసుకున్న సినీ అభిమానులు, నెటిజన్లు భరత్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Master Bharath

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us