Masooda : ఓటీటీలో రిలీజ్ కు రెడీ అవుతోన్న మసూద.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే..
అంతే కాదు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతున్నాయి. కార్తికేయ2, కాంతారా సినిమాలు దానికి ఉదాహరణలు. ఇక ఇప్పుడు మరో సినిమాకూడా ఈ లిస్ట్ లో చేరింది.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల హవా నడుస్తోంది. తక్కువ బడ్జెట్ తో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. అంతే కాదు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతున్నాయి. కార్తికేయ2, కాంతారా సినిమాలు దానికి ఉదాహరణలు. ఇక ఇప్పుడు మరో సినిమాకూడా ఈ లిస్ట్ లో చేరింది. ఆసినిమానే మసూద. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో వచ్చిన సినిమా మసూద. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్‌ని దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా నవంబర్ 18న మసూద ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో నటించిన కావ్య కళ్యాణ్ రామ్ గుర్తుండే ఉంటుంది. ఈ బ్యూటీ అల్లు అర్జున్ హీరోగా పరిచయమైన గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆ సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో కనిపించింది కావ్య.
ఇదిలా ఉంటే ఈ సినిమాను త్వరలోనే ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా స్ట్రీమింగ్ చేయనుందని తెలుస్తోంది. ఈ మూవీని ‘ఆహా’ భారీ ధరకి కొనుగోలు చేసిందని.. డిసెంబరు 16 లేదా 23న స్ట్రీమింగ్‌కి ఉంచబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ 16న అవతార్2 సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అదే రోజు మసూదాను ఓటీటీలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. త్వరలో దీని పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.