టాలీవుడ్ లో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో షియాజీ షిండే ఒకరు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే ఆయన తన విలనిజంతో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమా తర్వాత చాలా సినిమాల్లో షియాజీ షిండే విలన్ గా నటించాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మెప్పించాడు. మరాఠీలో ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన షాయాజీ షిండే ఇప్పటి వరకు తెలుగు, తమిళ, మారఠీ, హిందీ ఇంగ్లీష్ భాషల్లో నటించారు. ఇక పోకిరి సినిమాలో షియాజీ షిండే నటనకు మంచి క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా తిన్నామా.. పడుకున్నామా.. తెల్లారిందా అనే డైలాగ్ బాగా పాపులార్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా షియాజీ షిండే వివాదంలో చిక్కుకున్నారు. ఆయన పై ఓ నిర్మాత కేస్ పెట్టారు.
షాయాజీ షిండే కారణంగా రూ.17 లక్షలు నష్టపోయినట్లు నిర్మాత చెబుతున్నారు. తన సినిమాలో నటిస్తానని రూ. 5 లక్షలు తీసుకుని నటించకపోగా తిరిగి ఇవ్వలేదని తన వల్ల రూ.17 లక్షలు నష్టపోయానని ఆరోపించారు మరాఠి నిర్మాత సచిన్ సనన్ . ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమా చేస్తానని ఒప్పుకున్నారని..కానీ ఆయన ఇచ్చిన డేట్స్ లో షూటింగ్ కి రాలేదని నిర్మాత తెలిపారు. కారణం అడిగితే సరిగ్గా సమాధానం చెప్పలేదని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిర్మాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేర్ నమోదు చేసుకున్నారు.
అంతే కాదు అఖిల భారత మరాఠీ ఫిల్మ్ కార్పొరేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు. అయితే ముందుగా మాట్లాడి ఈ సమస్యను పరీక్షించుకుందామంటే ఆయన ఫోన్ కూడా తీయడం లేదట. వేరే వ్యక్తితో అడిగించగా సమాధానం కూడా సరిగ్గా చెప్పలేదట. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేయక తప్పలేదని అంటున్నారు ఆ నిర్మాత. మరి ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.