Maa Elections 2021: ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌లో మా కొత్త కార్యవర్గం కొలువుదీరింది.. ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణం చేశారు.. కొత్త అధ్యక్షుడు మంచు విష్ణుతో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేశారు..విష్ణుతో మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్ ప్రమాణం చేయించారు..
విష్ణు ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. అలాగే, పలువురు టాలీవుడ్ ప్రముఖులు అటెండ్ అయ్యారు.. బాలకృష్ణ, కోటా శ్రీనివాసరావు, కైకాల సత్యనారాయణ తదితరుల ఇంటికెళ్లి మంచు ఫ్యామిలీ స్వయంగా ఆహ్వానించింది.
మంచు విష్ణు ప్యానెల్ నుంచి మొత్తం 15 మంది గెలిచారు. అధ్యక్షుడిగా విష్ణు, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, జాయింట్ సెక్రటరీగా గౌతంరాజు, వైస్ ప్రెసిడెంట్‌గా మాదాల రవి, ట్రెజరర్‌గా శివబాలాజీ విక్టరీ కొడితే… ఈసీ మెంబర్స్‌గా గీతాసింగ్, అశోక్ కుమార్, శ్రీలక్ష్మి, సి.మాణిక్, శ్రీనివాసులు, హరనాథ్‌బాబు, శివన్నారాయణ, సంపూర్ణేష్‌బాబు, శశాంక్, బొప్పన విష్ణు విజయం సాధించారు. వీళ్లంతా ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు..
ఇదిలా ఉంటే.. మంచు విష్ణు ప్రమాణ స్వీకరానికి ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు హాజరు కాలేదు… అలాగే మెగాస్టార్ చిరంజీవికి మా అధ్యక్ష ప్రమాణ స్వీకరానికి ఆహ్వానం అందకపోవడంతో ఆయన సైతం దూరంగా ఉన్నారు.
Also Read: RK Roja: బాలకృష్ణకు ఫోన్ చేసిన ఎమ్మెల్యే రోజా.. విషయం ఏంటంటే..
pragya Jaiswal: రోజులు లెక్కపెడుతున్నాను అంటోన్న ప్రగ్యా.. అందాల భామకు ఎంత కష్టమొచ్చిందో..