
కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నాడు మంచు విష్ణు (Manchu Vishnu). హిట్.. ప్లాపులతో సంబంధం లేకుండా.. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవల మోసగాళ్లు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు విష్ణు. కాజల్.. మంచు విష్ణు ప్రధాన పాత్రలో భారీ బడ్డెట్‌తో విష్ణు సొంత బ్యానర్లో నిర్మించిన ఈ సినిమా ఆశించినంతగా హిట్ కాలేకపోయింది. దీంతో విష్ణు సినిమాలకు కాస్త గ్యా్ప్ ఇచ్చాడు. అదే సమయంలో మా అధ్యక్ష పదవికి పోటీ చేసి విజయం సాధించాడు. మా అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నాడు మంచు విష్ణు..
ఇదిలా ఉంటే… మంచు విష్ణు తన సోషల్ మీడియా ఖాతాలలో గాలి నాగేశ్వర రావును పరిచయం చేశాడు. ఏంటీ గాలి నాగేశ్వరరావు ఎవరు అనుకుంటున్నారా ? అతను మరెవరో కొత్త వ్యక్తి అనుకుంటే పొరపాటు పడినట్టే.. గాలి నాగేశ్వర రావు అనేది మంచు విష్ణు కొత్త చిత్రంలోని పాత్ర పేరు. ఈ సినిమాకు ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో మంచు విష్ణు గాలి నాగేశ్వర రావు పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని అవ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించనున్నారు. తన కెరీర్ లో ఇప్పటివరకు చేయని సరికొత్త పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను అంటూ ట్వీట్ చేశారు విష్ణు.
Introducing my new character Gali Nageshwara Rao.. Exciting details coming soon..#VishnuManchu #AskVM #ComingSoon #NewMovie pic.twitter.com/h0mJ2vM4Ba
— Vishnu Manchu (@iVishnuManchu) March 4, 2022
Also Read: Telugu Indian Idol Episode 3: తెలుగు ఇండియన్ ఐడల్ ఎపిసోడ్ 3.. ఎవరు గోల్డెన్ మైక్ అందుకున్నారంటే..
Summer Diet: వేసవిలో ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే వ్యాధులు రావు.. అవేంటంటే..
మీరు పనిచేసే చోట ఈ వస్తువులు ఉంటే అంత శుభమే.. ఈ చిట్కాలను పాటిస్తే జీతం పెరుగుతుంది..