Kingdom Movie: కింగ్ డమ్‌ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్.. మంచు విష్ణు స్పెషల్ రిక్వెస్ట్.. ఏంటంటే?

విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ సినిమా ఇవాళ (జులై 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. రివ్యూలన్నీ కూడా పాజిటివ్ గానే వచ్చాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు కలెక్షన్లు ఎన్ని కోట్లు రావొచ్చన్నది ఆసక్తికరంగా మారింది.

Kingdom Movie: కింగ్ డమ్‌ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్.. మంచు విష్ణు స్పెషల్ రిక్వెస్ట్.. ఏంటంటే?
Kingdom Movie

Updated on: Jul 31, 2025 | 10:19 PM

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ చాలా రోజుల తర్వాత ఎంతో ఆనందంగా కనిపించాడు. దీనికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. ఈ మధ్యన వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నాడు విజయ్. లైగర్ డిజాస్టర్ తర్వాత అతను చేసిన ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు హిట్ అయ్యాయి. కానీ ఇవి విజయ్ దేవరకొండ రేంజ్ రేంజ్ కు తగ్గ సినిమాలు కావని అభిమానులు ఫీల్ అయ్యారు. దీంతో గ్యాప్ తీసుకునైనా ఫ్యాన్స్‌కు గట్టి బ్లాక్ బస్టర్ ఇవ్వాలనుకున్నాడు విజయ్. అది ఇప్పుడు కింగ్ డమ్ మూవీతో నెరవేరింది. గురువారం (జులై 31) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ గా నిలుస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి రౌడీ బాయ్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడంటూ విజయ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

కాగా కింగ్ డమ్ సినిమాపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇప్పటికే రష్మిక మందన్నా, నాని తదితర స్టార్ సెలబ్రిటీలు కింగ్ డమ్ యూనిట్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే మా అధ్యక్షులు మంచు విష్ణు కింగ్ డమ్ చిత్ర బృందాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ‘ మై బ్రదర్ వంశీ ఆల్ ది బెస్ట్ . విజయ్ దేవరకొండ, సత్యదేవ్ కు బెస్ట్ విషెస్. సినిమా లవర్స్ ని మనస్సూర్తిగా కోరుతున్నాను. సినిమాను థియేటర్స్ లోనే చూడండి.. సమీక్షకులపై ఆధారపడకండి. ఈ ప్రమాదకరమై సమీక్షకుల సంస్కృతిని త్వరలోనే పరిష్కరిస్తాను . సినిమాను ప్రోత్సహించండి. హర హర మహదేవ్ అంటూ పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మంచు విష్ణు ట్వీట్..

 

అంతకు ముందు నాని కూడా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి