GINNA Twitter Review: థియేటర్స్ లోకి మంచు విష్ణు ‘జిన్నా’.. ట్విట్టర్ రివ్యూలు ఎలా ఉన్నాయంటే

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేసిన కూడా ఆ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాడు మంచు విష్ణు. రీసెంట్ గా..

GINNA Twitter Review: థియేటర్స్ లోకి మంచు విష్ణు జిన్నా.. ట్విట్టర్ రివ్యూలు ఎలా ఉన్నాయంటే
Ginna

Updated on: Oct 21, 2022 | 6:54 AM

మంచు విష్ణు చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అప్పుడెప్పుడో వచ్చిన ఢీ సినిమా తర్వాత ఆ స్థాయిలో హిట్ అందుకోవడం కోసం చాలా కష్టపడుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేసిన కూడా ఆ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాడు మంచు విష్ణు. రీసెంట్ గా మోసగాళ్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ విష్ణు అక్కగా నటించారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి కీలక పాత్రలో నటించారు . తాజాగా ఈ టాలెంటెడ్ హీరో జిన్నా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సూర్య అనే నూతన దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు . ఈ సినిమాలో మంచు విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్ నటించగా సన్నీలియోన్ కీలక పాత్రలో నటించింది. ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన కొందరు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు సినిమా పై ఆసక్తికి క్రియేట్ చేశాయి. ఇక రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ సినిమా పై ఆసక్తిని పెంచేసింది. జిన్నా’ సినిమాను అవ్‌రామ్ భక్త మంచు సమర్పణలో అవా ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మించారు.

ఇవి కూడా చదవండి

కేవలంలో తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈరోజు విడుదల చేశారు. యూఎస్, యూకే, మలేసియాలో సైతం ‘జిన్నా’ను విడుదల చేస్తున్నట్టు ఇప్పటికే విష్ణు ప్రకటించారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారంటే..


మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.