Manchu Manoj: మంచాన పడ్డ టాలీవుడ్ కమెడియన్.. ఇంటికెళ్లి ధైర్యం చెప్పిన మంచు మనోజ్.. వీడియో

సుమారు 100 కు పైగా సినిమాల్లో నటించించాడు రామ చంద్ర. తన నటనతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. అయితే ఇప్పుడీ కమెడియన్ అనారోగ్య సమస్యలతో మంచాన పడ్డాడు. మంచం పైనుంచి కనీసం కదల్లేని దీన స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఈ విషయం వెలుగులోకి రాగా..

Manchu Manoj: మంచాన పడ్డ టాలీవుడ్ కమెడియన్.. ఇంటికెళ్లి ధైర్యం చెప్పిన మంచు మనోజ్.. వీడియో
Manchu Manoj, Ramachandra

Updated on: Sep 02, 2025 | 6:51 PM

రామ చంద్ర.. ఈ పేరు వింటే చాలా మందికి గుర్తుకు రాకపోవచ్చు.. కానీ ‘వెంకీ’ సినిమాలో హీరో రవితేజ ఫ్రెండ్ బుజ్జి అంటే ఇట్టే గుర్తు పడతాడు. ఈ సినిమాలో తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు రామ చంద్ర. ఇదే కాదు ఆనందం, సొంతం, కింగ్, దుబాయి శీను, లౌక్యం వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఎక్కువగా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లలో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓవరాల్ గా 100కి పైగా సినిమాల్లో నటించిన రామ చంద్ర ఇప్పుడు దయనీయ స్థితిలో ఉన్నడు. పెరాలసిస్ సోకడంతో  పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. కనీసం కదల్లేని స్థితిలో ఉన్న అతని దీని స్థితి గురించి ఇటీవలే ఇంటర్వ్యూ ద్వారా అందరికీ తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉ‍న్న రామచంద్రను టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కలిశాడు. మంగళవారం (సెప్టెంబర్ 02) హైదరాబాద్ లోని అతని ఇంటి కెళ్లి పరామర్శించాడు. రామ చంద్ర ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వైద్య చికిత్స తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సందర్భంగా రామచంద్రను చూసి మంచు మనోజ్ చలించిపోయారు. కమెడియన్ కు ధైర్యం చెప్పాడు. సందర్భంగా సినిమా ఇండస్ట్రీ తరపున రామచంద్రకు వీలైనంత సాయం చేస్తానని మనోజ్హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా రామ చంద్ర తల్లిదండ్రులు ఎప్పుడో కన్నుమూశారు. ప్రస్తుతం అతని తమ్ముడే తన బాగోగులు చూసుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి

రామచంద్ర ఇంట్లో మంచు మనోజ్..

రోడ్డు ప్రమాదంతో..

కాగా రామచంద్ర గతంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచే సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ‘ రోడ్డు ప్రమాదం జరగడంతో సినిమాలకు దూరం అయ్యా. డబ్బులన్నీ అయిపోయాయి. అప్పుల పాలయ్యాను. అందులో చాలా వరకు తీర్చేశాను.. కానీ ఇంకా ఉన్నాయి. ఇప్పుడు సినిమా అవకాశాలు రావడం లేదు. నిర్మాతల దగ్గరకు వెళ్తే ఎవరు నువ్వు.? ముఖం గుర్తులేదు అంటున్నారు. ఆ మాటలు విని తట్టుకోలేకపోతున్నాను. నేను ఎవరి సాయం కోసం ఎదురుచూడటం లేదు. కేవలం అవకాశాల కోసం మాత్రమే ఎదురుచూస్తున్నాఅని ఇటీవల వాపోయాడు రామచంద్ర. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ కమెడియన్ ఇంటి కెళ్లి ధైర్యం చెప్పాడు. తన వంతు సాయం చేస్తానని భరోసా ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. 

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.