Manchu Manoj: ‘నీ రాకతో నా జీవితం ప్రేమతో నిండిపోయింది’.. పెళ్లి రోజున మౌనికపై ప్రేమ కురిపించిన మంచు మనోజ్

ఆదివారం (మార్చి3) తో వీరి వివాహం జరిగి ఏడాది. దీంతో తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారీ లవ్లీ కపుల్‌. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. అలాగే సామాజిక మాధ్యమాల వేదికగా పరస్పరం వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పుకున్నారు మనోజ్, మౌనిక.

Manchu Manoj: నీ రాకతో నా జీవితం ప్రేమతో నిండిపోయింది.. పెళ్లి రోజున మౌనికపై ప్రేమ కురిపించిన మంచు మనోజ్
Manchu Manoj Family

Updated on: Mar 04, 2024 | 6:50 AM

టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌- భూమా మౌనికా రెడ్డి గతేడాది వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో గతేడాది మార్చి 3న వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. మనోజ్ సోదరి మంచు లక్ష్మి పెళ్లి పెద్దగా వ్యవహరించారు. దగ్గరుండి మరీ మనోజ్, మౌనికల పెళ్లి జరిపించారు. ఆదివారం (మార్చి3) తో వీరి వివాహం జరిగి ఏడాది. దీంతో తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారీ లవ్లీ కపుల్‌. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. అలాగే సామాజిక మాధ్యమాల వేదికగా పరస్పరం వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పుకున్నారు మనోజ్, మౌనిక. ఈ సందర్భంగా మనోజ్, ధైరవ్‌లతో కలిసున్న ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసిన మనోజ్ ‘ నా ప్రియమైన భార్య భూమా మౌనికకు మొదటి వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రతి రోజు ప్రేమ, సంతోషంతో నిండిన అద్భుతమైన ప్రయాణమిది. ధైరవ్, మనకు పుట్టబోయే బుజ్జాయి కోసం ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. మీ రాక నా జీవితాన్ని ప్రేమతో అసాధారణంగా మార్చేసింది. మీ తల్లిదండ్రుల లోటును ఎన్నటికీ భర్తీ చేయలేను. కానీ వారిలా మిమ్మల్ని సంరక్షిస్తానని మాటిస్తున్నాను. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మిమ్మల్ని రక్షించుకుంటానని వాగ్ధానం చేస్తున్నాను. ఇక్కడ మాకు, మా కుటుంబానికి అనేక మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ సందర్భంగా నా భార్యమణికి పెళ్లి రోజు శుభకాంక్షలు. మీరు నా మనసు, ఆత్మలో అత్యంత విలువైన భాగం. ఇప్పటికీ, ఎప్పటికీ మిమ్మల్ని ప్రేమించే మను’ అంటూ తన భార్యపై ప్రేమను కురిపించాడు మనోజ్. దీనికి లవ్ సింబల్ ను కూడా జత చేశాడు.

ఇటీవలే మౌనిక ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు మనోజ్‌ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ ఏడాదిలోనే మనోజ్- మౌనిక తమ బిడ్డకు స్వాగతం పలకనున్నారు. ఇక మౌనిక కూడా సోషల్ మీడియా వేదికగా తన భర్తకు ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పింది.

ఇవి కూడా చదవండి

 

మౌనిక ఎమోషనల్ పోస్ట్..

 

బేబీ బంప్ తో  భూమా మౌనికా రెడ్డి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.