Manchu Manoj: వారిద్దరిపై మంచు మనోజ్ ప్రశంసలు.. ఆ ఇద్దరూ నా ఫేవరేట్ హీరోస్ అంటూ ట్వీట్..

మంచు మనోజ్ (Manchu Manoj)..డైలాగ్ కింగ్ మోహన్ బాబు వారసుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. దొంగా దొంగది సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యాడు

Manchu Manoj: వారిద్దరిపై మంచు మనోజ్ ప్రశంసలు.. ఆ ఇద్దరూ నా ఫేవరేట్ హీరోస్ అంటూ ట్వీట్..
Manchu Manoj

Updated on: Feb 25, 2022 | 8:01 PM

మంచు మనోజ్ (Manchu Manoj)..డైలాగ్ కింగ్ మోహన్ బాబు వారసుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. దొంగా దొంగది సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు మంచు మనోజ్. ఇటు సోషల్ మీడియాలోనూ మంచు మనోజ్ ఎప్పుడో ఒక పోస్ట్ చేస్తుంటారు. తాజాగా తన ఫేవరేట్ హీరోస్ ఎవరనే విషయాన్ని బయటపెట్టాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం భీమ్లా నాయక్. శుక్రవారం విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ టాక్ సంపాదించుకుంది. ఇక థియేటర్ల వద్ద ఫ్యాన్స్ చేసే రచ్చ గురించి తెలిసిందే. పవన్ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజాగా మంచు మనోజ్ పవన్, రానా సినిమా పై ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు. ” నాకు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులు ఓకే ఫ్రేములో ఉన్నారు. ఇప్పటికే అన్ని సానుకూలమైన స్పందనలను విన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఒకే ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నకు.. నా డార్లింగ్ రానా దగ్గుబాటికి… త్రివిక్రమ్ గారి టీమ్ మొత్తానికి బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను ” అంటూ ట్వీట్ చేశారు.

ఇక మరోవైపు.. డైరెక్టర్ హరీష్ శంకర్ సైతం పవన్ సినిమాపై ఆసక్తికర ట్వీట్ చేశారు. బావా… నీ కెరీర్‌లోనే ఇది బెస్ట్‌ వర్క్‌. ఇది బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కాదు.. బ్యాక్‌బోన్‌ ఆఫ్‌ భీమ్లా..! నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది బావా..! రానా.. నీలో నేను కేవలం డేనియల్‌ శేఖర్‌ని మాత్రమే చూశా. నువ్వు అదరగొట్టేశావు’ అంటూ ట్వీట్‌ చేశారు

Also Read: Bheemla Nayak Review: స‌మ్మర్ సినిమాల‌కు శుభారంభం.. భీమ్లా నాయ‌క్‌.. పర్‌ఫెక్ట్‌ మూవీ రివ్యూ..

Ram gopal Varma: ‘భీమ్లా నాయక్‌ ఒక భూకంపం.. హిందీలో విడుదల చేయాల్సిందే’.. ఆర్జీవీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్..

Bheemla Nayak: భీమ్లా నాయక్‌ సినిమాపై స్పందించిన చంద్రబాబు, లోకేష్‌.. ఏమన్నారంటే..

Viral Photo: ఇతడి డైలాగ్ గర్జనలా ఉంటుంది.. ఫైట్ యుద్ధంలా ఉంటుంది.. ఎవరో గుర్తించారా