Manchu Manoj: ‘శివయ్యా’.. కన్నప్ప సినిమా టీమ్‌కు క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్

మంచు మనోజ్ నటించిన తాజా చిత్రం భైరవం. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఏలూరులో ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి మంచు మనోజ్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

Manchu Manoj: శివయ్యా.. కన్నప్ప సినిమా టీమ్‌కు క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్
Manchu Vishnu, Manchu Manoj

Updated on: May 24, 2025 | 2:47 PM

గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో గొడవలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. తండ్రి మోహన్ బాబు, సోదరుడు విష్ణుకు, మంచు మనోజ్ మధ్య తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. అంతేకాదు ఒకరిపై ఒకరు పోలీస్ కేసులు పెట్టుకున్నారు. కోర్టుల చుట్టూ తిరిగారు. ఇదే విషయంపై భైరవం సినిమా ఈవెంట్ లో మంచు మనోజ్ ఎమోషనల్ అయ్యాడు. తన ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల విషయాన్ని ప్రస్తావించిన మనోజ్.. తనకు ఇబ్బందులు ఉన్న సమయంలో ఆ పరమ శివుడే డైరెక్టర్‌ విజయ్‌ రూపంలో వచ్చి భైరవం సినిమా ఆఫర్‌ ఇచ్చాడన్నాడు. ‘ శివుడిని శివయ్యా.. అని పిలిస్తే రాడు.. ఆయన్ని మనసారా తలచుకుంటే మా దర్శకుడి రూపంలోనో.. మీ అందరి రూపంలో వస్తాడు’ అంటూ పరోక్షంగా కన్నప్ప సినిమాలో మంచు మనోజ్‌ చెప్పిన శివయ్యా డైలాగ్‌పై సెటైర్లు వేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరలయ్యాయి. అయితే తాజాగా శివయ్య కామెంట్స్‌పై మంచు మనోజ్‌ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శివయ్యా అనే డైలాగ్‌పై సెటైర్లు వేయడం తప్పని అంగీకరించాడు ..

‘సినిమా అంటే ఒక్కడికాదు.. అందులో ఎంతో మంది పని చేస్తారు. కేవలం హీరోలే కాకుండా.. డైరెక్టర్‌,మ్యూజిక్‌ డైరెక్టర్‌, కొరియోగ్రాఫర్, ఇలా ఎంతో మంది సినిమా కోసం కష్టపడతారు. మోహన్ లాల్.. ప్రభాస్.. ఇలా అందరూ కష్టపడి ఈ సినిమా చేశారు. ఒక్కరి కోసం సినిమాను విమర్శించడం తప్పే. ఒక సినిమా వాడిగా నేను అలా అని ఉండికూడదు. ఎప్పుడైనా ఏదైనా అని ఉంటే.. కన్నప్ప టీంకి క్షమాపణలు కోరుతున్నాను. అవి ఎమోషనల్‌గా చేసిన కామెంట్సే తప్ప..మరో ఉద్దేశం నాకు లేదు. కన్నప్ప సినిమా భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని మనోజ్‌ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

కాగా భైరవం సినిమాలో మంచు మనోజ్ తో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్‌ హీరోలుగా నటించారు.అదితీ శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై హీరోయిన్లుగా నటించారు. జయంతిలాల్‌ గడా సమర్పణలో కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది.

భైరవం సినిమాలో కన్నప్ప..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..