టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ త్వరలోనే తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు. అతని సతీమణి భూమా మౌనికా రెడ్డి త్వరలోనే ఓ పండంటి బిడ్డను ప్రసవించనుంది. ప్రస్తుతం తన భార్య మౌనిక ప్రెగ్నెన్సీతో ఉందనే శుభవార్తను సోషల్ మీడియాలో పంచుకుని మురిసిపోయాడు మనోజ్. పర్సనల్ విషయాలను పక్కన పెడితే.. ప్రస్తుతం సినిమాలు, టీవీ షోలతో బిజీబిజీగా ఉంటున్నాడు హీరో మనోజ్. ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాల కోసం కొంచెం సమయం కేటాయిస్తుంటాడు మనోజ్. గతంలో పలు సార్లు అనాథ పిల్లలు, విద్యార్థులకు తన వంతు సాయం చేసి తన మంచి మనసును చాటుకున్నాడు. ఇప్పుడు మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు మంచు వారబ్బాయి. మౌనిక ప్రెగ్నెన్సీ గర్భం ధరించడంతో తాజాగా హైదరాబాద్‌లోని ఓ అనాథశ్రమానికి వెళ్లాడు మనోజ్. అక్కడి విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా భార్యతో కలిసి స్వయంగా పిల్లలకు భోజనాలు వడ్డించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు మనోజ్ దంపతులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘ అభిమానులు.. ‘మీరు గ్రేట్ అన్నా, మీకు అంతా మంచే జరగాలి’ అంటూ కితాబిస్తున్నారు.
మనోజ్ సోదరి మంచు లక్ష్మి కూడా ఇటీవల సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. టీచ్ ఫర్ ఛేంజ్ అంటూ ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటోంది. విద్యార్థుల చదువు, వసతికి కావాల్సిన సౌకర్యాలను సమకూరుస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వాట్ ది ఫిష్ అనే మూవీలో నటిస్తున్నాడు మనోజ్. మెగా డాటర్ నిహారిక ఇందులో ఒక కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే ఈటీవీ విన్‌లో ఉస్తాద్ అనే రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు.
“Remembering and honoring my beloved Athamma, Shree Bhuma Shoba Nagi Reddy garu, on her birthday 🙏🏼❤️
Athamma. In your loving embrace, we find comfort in sharing joyful news: Shree Bhuma Nagi Reddy Mama and you are becoming grandparents once again. Our little Dhairav is… pic.twitter.com/7ZIXk5rPtn
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) December 16, 2023
🌟✨ Happy Diwali to all the beautiful souls out there! 🙏🏼❤️ Wishing you a life filled with endless love and boundless joy. Thank you for your lovely wishes to me and my family. 💖✨ #HappyDiwali #LoveandGratitude pic.twitter.com/VGBNfbNvQ2
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) November 12, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.