M weds M: కొత్త అల్లుడికి గ్రాండ్‌గా వెల్‌కమ్ పలికిన రాయలసీమ

పొలిటికల్‌గా బలమైన భూమా ఫ్యామిలీ, సినిమాటిక్ ఫ్లేవర్లున్న మంచు ఫ్యామిలీ... వియ్యమందుకున్నాయి. దీంతో... మౌనిక వెడ్స్ మనోజ్ అనే టాపిక్‌ ఇప్పుడు టూస్టేట్స్‌లో ట్రెండవుతోంది. అటు... సీమ అల్లుడయ్యాక... రాయల్‌గా టూరేశారు మంచు మనోజ్. కొత్తల్లుడికి గ్రాండ్‌గా వెల్‌కమ్ పలికింది రాయలసీమ.

M weds M: కొత్త అల్లుడికి గ్రాండ్‌గా వెల్‌కమ్ పలికిన రాయలసీమ
Manchu Manoj Couple

Updated on: Mar 05, 2023 | 6:14 PM

మంచు మోహన్‌బాబు తనయుడు మంచు మనోజ్, భూమా నాగిరెడ్డి కూతురు మౌనికారెడ్డి మూడుముళ్లతో ఒక్కటయ్యారు. సన్నిహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో మంచు లక్ష్మి ఇంట్లో వీళ్ల పెళ్లి జరిగింది. మెహిందీ ఫంక్షన్‌లో మనోజ్ అండ్ మౌనికా కపుల్‌తో పాటు… అతిథులు చేసిన సందడి అదరహో అనిపించింది. పెళ్లి తర్వాత రాయలసీమలో స్పెషల్‌గా టూరేశారు నవ దంపతులు. భారీ కాన్వాయ్‌తో పోలీస్ సెక్యూరిటీతో హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు. భార్య మౌనికతో కలిసి కర్నూల్‌ వెళ్లిన మనోజ్‌కు వేలాదిగా అభిమానులు స్వాగతం పలికారు.

మౌనిక తాత ఎస్వీ సుబ్బారెడ్డి ఆశీర్వాదం తీసుకుని… మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు కొత్త దంపతులు. వీరి వెంట తెలంగాణ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఉన్నారు. తమ వెంట నిలిచిన బంధుమిత్రులకు, అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ ఎమోషన్ అయ్యారు మంచు మనోజ్. తర్వాత ప్రొద్దుటూరులో రామసుబ్బారెడ్డిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆళ్లగడ్డకు చేరుకున్న నవ దంపతులకు ఫ్లెక్లీలతో స్వాగతం పలికారు అభిమానులు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతుల సమాధిని సందర్శించి, విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు మనోజ్ అండ్ మౌనిక. భూమా అఖిలప్రియ కూడా వీళ్ల వెంట ఉన్నారు.

మొదటి భార్య ప్రణతిరెడ్డితో మూడేళ్ల కిందటే విడాకులు తీసుకున్నారు మనోజ్‌. కొంతకాలంగా చిత్ర పరిశ్రమకూ, మీడియాకూ దూరంగా ఉంటూ వచ్చారు. మంచు-భూమా కుటుంబాల మధ్య గతంనుంచే స్నేహబంధం ఉంది. భూమా దంపతుల మరణం తర్వాత మౌనిక-మనోజ్ మరింత సన్నిహితులయ్యారు. క్లిష్ట సమయాల్లో మౌనిక కుటుంబానికి చేదోడుగా ఉంటూ వచ్చారు మనోజ్. ఆవిధంగా వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

గత అక్టోబర్‌లో సీతాఫల్‌ మండిలో వినాయకుడి మండపం దగ్గర కలిసి కనిపించగానే.. వీళ్ల పెళ్లి ముచ్చట ఖరారైంది. సోదరి ఇప్పుడు మంచు లక్ష్మి లీడ్ తీసుకుని… తమ్ముడి పెళ్లిని తానే స్వయంగా దగ్గరుండి జరిపించారు. ల‌వ్ యూ అక్కా… ఏ జ‌న్మ పుణ్యమో… నువ్వు అక్కలా దొరికావు అంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యారు మంచు మనోజ్. ఏదైతేనేం.. భూమా కుటుంబంతో సంబంధం కలుపుకుని… వైవాహిక జీవితంలో కొత్త ఇన్నింగ్స్ షురూ చేసుకున్నారు మంచు మనోజ్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..