AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ సినిమా టైటిల్ విషయంలో చాలా రచ్చ జరిగిందట..కానీ

ఫ్యామిలీ సినిమాలతో పాటు మాస్ సినిమాలను కూడా ప్రేక్షకులకు అందించారు కృష్ణారెడ్డి. ఆయనకు సూపర్ స్టార్ కృష్ణ అంటే చాలా అభిమానం.. ఆయనను హీరోగా పెట్టి పలు సినిమాలు చేశారు.

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ సినిమా టైటిల్ విషయంలో చాలా రచ్చ జరిగిందట..కానీ
Krishna
Rajeev Rayala
|

Updated on: Mar 05, 2023 | 6:39 PM

Share

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా రాణించారు మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి. దర్శకుడిగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా, హీరోగా ఇలా ఆయన చేయని పని లేదు. ఎన్నో అంద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు కృష్ణారెడ్డి. ఎన్నో సూపర్ హిట్స్ ను అందించారు. ఫ్యామిలీ సినిమాలతో పాటు మాస్ సినిమాలను కూడా ప్రేక్షకులకు అందించారు కృష్ణారెడ్డి. ఆయనకు సూపర్ స్టార్ కృష్ణ అంటే చాలా అభిమానం.. ఆయనను హీరోగా పెట్టి పలు సినిమాలు చేశారు. అలాగే ఆయన వేరే హీరోలతో సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాల్లో ఒక పాట కృష్ణ గారితో చేయించేవారు ఈ దర్శకుడు. అయితే ఆయన కృష్ణ తో కలిసి చేసిన సినిమాల్లో నెంబర్ వన్ సినిమా ఒకటి. గతంలో ఈ సినిమా గురించి కృష్ణ రెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అయితే ఈ సినిమా గురించి కృష్ణ గారిని సంప్రదించినప్పుడు కేవలం ఒకే ఒక్క సీన్ చెప్పారట.. బాగుంది సినిమా చేద్దాం అన్నారట. మిగిలిన కథ రెడీగా ఉందా అని అడిగితే లేదు మీకు తగ్గట్టుగా కథను సిద్ధం చేస్తా అని చెప్పను. దాంతో ఆయన కూడా సినిమా మంచి హిట్ అవుతుంది. ఆ ఒక్క సీన్ చాలు సినిమా హిట్ అవ్వడానికి పుతి కథ రెడీ చేసుకో అని చెప్పారట.

అలాగే ఈ సినిమా టైటిల్ విషయం లోనూ కొన్ని అభ్యంతరాలు కూడా ఎదురయ్యాయట. ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోలు చాలా మంది ఉన్నారు. కృష్ణగారికే ఆ టైటిల్ పెట్టడం పై చాలా మంది నన్ను ప్రశ్నించారు. కానీ నా సినిమా కథ ప్రకారం అదే టైటిల్ కరెక్ట్ గా ఉంటుంది. సినిమాలో కుటుంబ బాధ్యతలు తీసుకునే కొడుకే నెంబర్ వన్. అలా నా సినిమాకు నెంబర్ వన్ అని టైటిల్ పెట్టాం అని క్లారిటీ ఇచ్చారు కృష్ణారెడ్డి. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Follow Us
పులులకు నేటి నుంచి 3 నెలలు చాలా కీలకం.. పర్యాటకులకు నో ఎంట్రీ..!
పులులకు నేటి నుంచి 3 నెలలు చాలా కీలకం.. పర్యాటకులకు నో ఎంట్రీ..!
వెంటాడిన మృత్యువు.. పెళ్లైన వారానికే వరుడు, అతని తండ్రి మృతి
వెంటాడిన మృత్యువు.. పెళ్లైన వారానికే వరుడు, అతని తండ్రి మృతి
ప్లేయింగ్-11 ప్రకటించిన ఇంగ్లాండ్, స్టార్ ప్లేయర్‌కు షాక్
ప్లేయింగ్-11 ప్రకటించిన ఇంగ్లాండ్, స్టార్ ప్లేయర్‌కు షాక్
ఈ రోజుల్లో చీపురు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులవ్వడం ఖాయం!
ఈ రోజుల్లో చీపురు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులవ్వడం ఖాయం!
ఎమ్మెల్యే కాదు ప్రాణదాత.. క్లిష్టమైన సర్జరీతో యువకుడికి కొత్తలైఫ్
ఎమ్మెల్యే కాదు ప్రాణదాత.. క్లిష్టమైన సర్జరీతో యువకుడికి కొత్తలైఫ్
కన్నీళ్లు పెట్టుకున్న నందిని రెడ్డి
కన్నీళ్లు పెట్టుకున్న నందిని రెడ్డి
వినియోగదారులకు అలర్ట్‌.. జూలైలో బ్యాంకులకు భారీగా సెలవులు!
వినియోగదారులకు అలర్ట్‌.. జూలైలో బ్యాంకులకు భారీగా సెలవులు!
రోజంతా కుర్చీలోనే కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే
రోజంతా కుర్చీలోనే కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే
పీఓకేలో తిరగబడ్డ జనం.. భారత్‌ వైపు చూపు..!
పీఓకేలో తిరగబడ్డ జనం.. భారత్‌ వైపు చూపు..!
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..