పిల్లల ఆన్‌లైన్ క్లాసుల కోసం ఆసరాగా ఉన్న ఆవు అమ్మకం..రంగంలోకి సోనూ సూద్
ప్రస్తుత కరోనా సమయంలో ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్‌లైన్ క్లాసుల పేరుతో పేద, మధ్యతరగతి తల్లితండ్రులపై తీవ్ర బారాన్ని మోపుతున్నాయి. అసలే ఆదాయానికి గండి పడిన సమయంలో ఫీజులు వసూలు చేయడంతో పాటు ఆన్‌లైన్ క్లాస్‌ల కోసం స్మార్ట్‌ఫోన్స్ , లాప్ ట్యాప్స్ కావాలంటూ విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయి. తాజాగా తమ ఇద్దరు చిన్నారుల ఆన్‌లైన్ క్లాస్‌ల కోసం స్మార్ట్‌ఫోన్ కొనేందుకు హిమాచల్ ప్రదేశ్‌లో ఓ వ్యక్తి తాము బ్రతుకు సాగేందుకు ఉపయోగపడుతోన్న ఆవును అమ్మిన ఉదంతం అందరి […]

ప్రస్తుత కరోనా సమయంలో ప్రైవేట్ విద్యాసంస్థలు ఆన్‌లైన్ క్లాసుల పేరుతో పేద, మధ్యతరగతి తల్లితండ్రులపై తీవ్ర బారాన్ని మోపుతున్నాయి. అసలే ఆదాయానికి గండి పడిన సమయంలో ఫీజులు వసూలు చేయడంతో పాటు ఆన్‌లైన్ క్లాస్‌ల కోసం స్మార్ట్‌ఫోన్స్ , లాప్ ట్యాప్స్ కావాలంటూ విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయి. తాజాగా తమ ఇద్దరు చిన్నారుల ఆన్‌లైన్ క్లాస్‌ల కోసం స్మార్ట్‌ఫోన్ కొనేందుకు హిమాచల్ ప్రదేశ్‌లో ఓ వ్యక్తి తాము బ్రతుకు సాగేందుకు ఉపయోగపడుతోన్న ఆవును అమ్మిన ఉదంతం అందరి మనసులను కలిచివేసింది. కోవిడ్ నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో స్కూళ్లన్నీ విద్యార్ధుల కోసం ఆన్‌లైన్ క్లాసులకు శ్రీకారం చుట్టాయి. కాంగ్రా జిల్లా జ్వాలాముఖికి చెందిన కుల్దీప్ కుమార్ పిల్లలు స్మార్ట్ ఫోన్ లేకపోవడంతో ఈ క్లాసులకు హాజరుకాలేకపోతున్నారు. నాలుగో తరగతి, రెండో తరగతి చదువుతున్న తమ పిల్లలు చదువులకు ఇబ్బందులు పడుతుండటంతో కుల్దీప్‌పై స్మార్ట్‌ఫోన్ కొనాలని నిశ్చయించుకున్నాడు. పిల్లలు చదువు కొనసాగించాలంటే స్మార్ట్‌ఫోన్ తప్పనిసరని టీచర్స్ సైతం కుల్దీప్‌కు సూచించారు.
అందుకు చేతిలో డబ్బు లేదు. బ్యాంకులు, వడ్డీ వ్యాపారులను కలిసినా ఉపయోగం లేదు. దీంతో ఏం చేయాలో తెలియక కేవలం రూ.6వేలకు తమ కుటుంబానికి జీవనాదారమైన ఆవును అమ్మేశాడు. ఈ విషయం బయటకు అందిరికీ తెలియడంతో..అతడి దీనస్థితిని చూసి మనసు చలించిపోయింది. తాను తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జ్వాలాముఖిలో ఉంటామని, తనకు కనీసం రేషన్ కార్డు కూడా లేదని కుల్దీప్ వెల్లడించాడు. ఆర్థిక సాయం కోసం తాను ఎన్నిసార్లు పంచాయితీ అధికారుల్ని సంప్రదించినా ఎలాంటి సాయం అందలేదని కుల్దీప్ తెలిపాడు. ఈ ఉదంతంపై జ్వాలాముఖి ఎమ్మెల్యే రమేష్ ధవాలా స్పందిస్తూ కుల్దీప్ కుమార్‌కు సత్వరమే ఆర్థిక సాయం చేయాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ నటుడు సోనూ సూద్..అతడి ఆవు వెనక్కి తిరిగి వచ్చేందుకు ఏర్పాటు చేస్తానని, ఎవరైనా వారి వివరాలు పంపాలని కోరాడు.
Let’s get this guy’s cows back. Can someone send his details please. https://t.co/zv0Mj8DCh9
— sonu sood (@SonuSood) July 23, 2020




