పొట్ట‌కూటి కోసం క‌ర్ర‌సాము చేస్తోన్న బామ్మ‌.. స్పందించిన‌ బాలీవుడ్ న‌టులు

పొట్ట కూటి కోసం కోవి విద్య‌లు అంటారు. అలా ఓ 75 ఏళ్ల బామ్మ ఎండ‌న‌క‌.. వాన‌నక రోడ్డుపై క‌ర్ర‌సాము చేయ‌డం ప్ర‌స్తుతం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. రోడ్డు ప‌క్క‌న ఈ బామ్మ క‌ర్ర‌సాము విన్యాసం చేస్తుంటే.. క‌న్ను రెప్ప వేయ‌కుండా చూస్తూ నిలుచుండిపోతున్నారు జ‌నాలు. అలాగే వారికి తోచిన స‌హాయం..

పొట్ట‌కూటి కోసం క‌ర్ర‌సాము చేస్తోన్న బామ్మ‌.. స్పందించిన‌ బాలీవుడ్ న‌టులు

పొట్ట కూటి కోసం కోవి విద్య‌లు అంటారు. అలా ఓ 75 ఏళ్ల బామ్మ ఎండ‌న‌క‌.. వాన‌నక రోడ్డుపై క‌ర్ర‌సాము చేయ‌డం ప్ర‌స్తుతం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. రోడ్డు ప‌క్క‌న ఈ బామ్మ క‌ర్ర‌సాము విన్యాసం చేస్తుంటే.. క‌న్ను రెప్ప వేయ‌కుండా చూస్తూ నిలుచుండిపోతున్నారు జ‌నాలు. అలాగే వారికి తోచిన స‌హాయం చేస్తున్నారు. అంత పెద్ద వ‌య‌సులో కూడా ఏమాత్రం త‌గ్గ‌లేదు బామ్మ‌ జోరు‌. రెండు క‌ర్ర‌లను రెండు చేతుల‌తో చ‌క‌చ‌కా తిప్పుతూ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. శాంతాబాయ్ అనే ఈ 75 ఏళ్ల బామ్మ పూణె వీధుల్లో చేసే క‌ర్ర విన్యాసాన్ని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు కొందరు.

కాగా బాలీవుడ్ న‌టుడు, జెనీలియా భ‌ర్త‌ రితేశ్ దేశ్ ముఖ్ ఈ బామ్మ క‌ర్రసాము వీడియోను చూసి ఆశ్య‌ర్య‌పోయాడు. వెంట‌నే వృద్ధురాలి వీడియోను త‌న ట్విట్ట‌ర్ ఖాతా వేదిక‌గా పోస్ట్ చేశాడు. ‘ఈ వ‌య‌సులో కూడా ఎంత‌టి నైపుణ్యం.. ఈ బామ్మ ఎంత చ‌క్క‌గా క‌ర్ర‌సాము చేస్తుంది. ఎలాగైనా నేను ఈ బామ్మ‌కు స‌హాయం చేస్తాను. ఆమెకు స‌హాయం అందించ‌డానికి నా సిబ్బందిని అక్క‌డికి పంపిస్తాన‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా పేర్కొన్నారు రితేశ్’‌.

ఈ వీడియోను చూసిన నెటిజ‌న్స్ కూడా ఆ బామ్మ వీడియోను షేర్ చేస్తూండ‌టంతో అది కాస్తా వైర‌ల్‌గా మారింది. ఏదేమైనా ఈ వ‌య‌సులో కూడా ఆమె ప‌లు ప్రాంతాల్లో తిరుగుతూ ఇలా క‌ర్ర‌సాము చేస్తుండంట‌తో ప‌లువురు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూనే.. బామ్మ‌కు ఏం క‌ష్ట‌మొచ్చిందోన‌ని విచారం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక ఈ బామ్మ వీడియో చూసిన బాలీవుడ్ సినీ న‌టుడు సోనూసూద్ కూడా త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా స్పందించాడు. ఈ పెద్దావిడ డీటైల్స్ ఉంటే నాకు పంపించండి. ఆవిడతో ఓ చిన్న ట్రైనింగ్ క్లాస్ పెట్టిస్తాను అంటూ తెలిపాడు.

Read More:

రోడ్డుపై కరోనా పేషెంట్ల ధ‌ర్నా.. భ‌యంతో పారిపోయిన స్థానికులు..

ఏపీలోని ఈ మూడు జిల్లాల్లోనే అత్య‌ధిక క‌రోనా కేసులు..

హోమ్ ఐసోలేష‌న్‌లో మాజీ ఎంపీ క‌విత కుటుంబం..

Click on your DTH Provider to Add TV9 Telugu