Kantara: కాంతార సినిమా చూస్తూ థియేటర్ లోనే కన్నుమూసిన వ్యక్తి.. ఎక్కడంటే

ముందుగా  కన్నడ భాషలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తెలుగుతో పాటు పలు భాషలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Kantara: కాంతార సినిమా చూస్తూ థియేటర్ లోనే కన్నుమూసిన వ్యక్తి.. ఎక్కడంటే
Kantara

Updated on: Oct 26, 2022 | 8:00 AM

ఇటీవల విడుదలైన సినిమాల్లో సంచలన విజయం సాధించిన సినిమా కాంతార. కన్నడ సినిమా అయిన కాంతార రీసెంట్ గా తెలుగులో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ముందుగా  కన్నడ భాషలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తెలుగుతో పాటు పలు భాషలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. భారీగా కలెక్షన్లు రాబట్టడమే కాదు..! మేకర్స్ అందరి చేత చప్పట్లు కొట్టిస్తుంది. కనుమరుగవుతున్న కన్నడ ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల మరోసారి ప్రజలకు గుర్తు చేసే చిత్రం ఇది. ఇక విడుదలైన ప్రతిచోటా వసూళ్ల వర్షం కురిపిస్తోన్న ఈ సినిమాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్వీటీ అనుష్క, కోలీవుడ్ స్టార్‌ ధనుష్‌,  కంగనా రనౌత్‌, ప్రభాస్ లాంటి సెలబ్రిటీలు కాంతారా సినిమాను చూసి సూపర్బ్‌ అంటూ తమ అనుభవాలను షేర్‌ చేసుకున్నారు.

తాజాగా కాంతార సినిమా చూస్తూ ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని తెలుస్తోంది. రాజశేఖర్ అనే 45 ఏళ్ల వ్యక్తి కాంతార సినిమా చూస్తూ కూర్చున్న సీటులోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇక ఆ వ్యక్తి అలా కింద పడిపోవడంతో వెంటనే థియేటర్ యాజమాన్యం సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్టు వైద్యులు తెలిపారట.

ఇప్పుడు ఇదే వార్త కన్నడ మీడియాలో వినిపిస్తోంది. ఈ సినిమాలో భూత కోల ఆచారాన్ని చూపించారు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటన ప్రేక్షకుల మైండ్ లో నుంచి అంత ఈజీగా పోదు అనే చెప్పాలి. కన్నడలో ఇప్పటికే రికార్డ్ సృష్టించిన కాంతార ఇప్పుడు ఇతర భాషల్లోనూ సత్తా చాటుడుతుంది. ముఖ్యంగా ఈ సినిమా హిందీలో కలెక్షన్స్ వేగం పెంచింది. ఈ చిత్రాన్ని హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించగా.. తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చేశారు.

ఇవి కూడా చదవండి