Mammootty: చిక్కుల్లో మమ్ముట్టి.. రెండేళ్ల క్రితం విడుదలైన సినిమా పై ఇప్పుడు వివాదం..

|

May 16, 2024 | 10:16 AM

2022లో విడుదలైన 'పుజు'  సినిమా పై ఇప్పుడు వివాదం రేగింది. ఈ సినిమాలో బ్రాహ్మణ వ్యతిరేక అంశాలున్నాయని , సోషల్ మీడియాలో మమ్ముట్టిని టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అయితే కేరళలోని పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, రాజకీయ ప్రముఖులు మమ్ముట్టికి అండగా నిలిచారు.

Mammootty: చిక్కుల్లో మమ్ముట్టి.. రెండేళ్ల క్రితం విడుదలైన సినిమా పై ఇప్పుడు వివాదం..
Mammootty
Follow us on

ప్రముఖ మలయాళ సినీ నటుడు మమ్ముట్టి కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నారు. మమ్ముట్టి పై కొందరు రైట్‌వింగ్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం 2 సంవత్సరాల క్రితం విడుదలైన ‘పుజు’ సినిమా! అవును, 2022లో విడుదలైన ‘పుజు’  సినిమా పై ఇప్పుడు వివాదం రేగింది. ఈ సినిమాలో బ్రాహ్మణ వ్యతిరేక అంశాలున్నాయని , సోషల్ మీడియాలో మమ్ముట్టిని టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అయితే కేరళలోని పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, రాజకీయ ప్రముఖులు మమ్ముట్టికి అండగా నిలిచారు.

సరిగ్గా రెండేళ్ల క్రితం అంటే 2022 మే 13న ‘పుజు’ సినిమా విడుదలైంది. ఆ సినిమాలో మమ్ముట్టి, పార్వతి తిరువత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాపై సోషల్ మీడియాలో వివాదాలు చెలరేగాయి. ఈ సినిమాలో బ్రాహ్మణ వ్యతిరేక కథ ఉందని, ఇందులో నటించడం మమ్ముట్టి తప్పిదమని కొందరు వివాదం ప్రారంభించారు.

దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి.. త్వరలోనే కౌంటింగ్ కూడా జరగనుంది. ఈ సమయంలో కులం-మతం అనే అంశాన్ని పెట్టుకుని ప్రజల దృష్టిని మళ్లించే వ్యూహం పన్నుతున్నారని.. ‘పుజు ’ సినిమా వివాదం వెనుక కూడా ఇదే ఉద్దేశం ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రైట్‌వింగ్ ట్రోల్స్‌ను కేరళ ప్రజలు వెతిరేకిస్తున్నారు. మంత్రి వి. శివన్ కుట్టి, కె. రాజన్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ తదితరులు మమ్ముట్టికి అనుకూలంగా కామెంట్స్ చేశారు. మలయాళీలకు మమ్ముట్టి గర్వకారణం. ఆ గౌరవం ఆయనకు ఎప్పుడూ ఉంటుంది. మమ్ముట్టిని మహమ్మద్ కుట్టి అని, కమల్ ని కమాలుద్దీన్ అని, విజయ్ ని జోసెఫ్ విజయ్ అని పిలిచే సంఘీ రాజకీయాలు ఇక్కడ జరగవు. ఇది కేరళ’ అని కె. రాజన్ పోస్ట్ చేసారు. మరి ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.