అబ్దుల్ కలాంతో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఆమెను చూస్తే ఫిదా అవ్వాల్సిందే

వరుసగా సినిమాలు చేసిన ఒక్క సూపర్ హిట్ సినిమా పడితే చాలు అని ఎదురుచూస్తున్నారు కొందరు.. మరికొంతమంది పెద్ద హీరోల సినిమాల్లో చాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒకటి రెండు సినిమాలకే పరిమితం అవుతున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ అవకాశాల కోసం ఈగర్ గా ఎదురుచూస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టరా.? పై ఫొటోలో అబ్దుల్ కలాం గారితో ఉన్న ఆ చిన్నారి ఎవరో కనిపెట్టండి చూద్దాం..!

అబ్దుల్ కలాంతో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఆమెను చూస్తే ఫిదా అవ్వాల్సిందే
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: May 16, 2024 | 9:49 AM

ఎంత అందంగా ఉన్నా కొంతమంది హీరోయిన్స్ కు అదృష్టం కలిసి రాదు. చూడగానే వావ్ అనిపించే అందం ఉన్నప్పటికీ .. అవకాశాలు మాత్రం అందుకోలేకపోతున్నారు చాలా మంది. వరుసగా సినిమాలు చేసిన ఒక్క సూపర్ హిట్ సినిమా పడితే చాలు అని ఎదురుచూస్తున్నారు కొందరు.. మరికొంతమంది పెద్ద హీరోల సినిమాల్లో చాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒకటి రెండు సినిమాలకే పరిమితం అవుతున్న హీరోయిన్స్ కూడా ఉన్నారు. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ అవకాశాల కోసం ఈగర్ గా ఎదురుచూస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టరా.? పై ఫొటోలో అబ్దుల్ కలాం గారితో ఉన్న ఆ చిన్నారి ఎవరో కనిపెట్టండి చూద్దాం..! ఆమె అందానికే ఫిదా కానీ కుర్రాడు ఉండడు.

పై ఫొటోలో అబ్దుల్ కలాంతో ఉన్న చిన్నారి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. ఆమె మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ సురభి. 2013లో వచ్చిన ఇవన్ వేరే మాదిరి అనే తమిళ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఆతర్వాత తమిళ్ లో వరుసగా సినిమాలు చేసింది. ఆతర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. సందీప్ కిషన్ హీరోగా నటించిన బీరువా అనే సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది. ఆతర్వాత శర్వానంద్ తో కలిసి ఎక్స్‌ప్రెస్_రాజా సినిమా చేసింది ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఆతర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది ఈ అమ్మడు ఎటాక్, నాని జెంటిల్ మేన్, అల్లు శిరీష్ తో కలిసి ఒక్క క్షణం, ఓటర్, ఆది సాయి కుమార్ శశి సినిమాల్లో నటించి మెప్పించింది ఈ అమ్మడు. ఇన్ని సినిమాలు చేసిన ఈ అమ్మడికి అనుకున్నంత గుర్తింపు రాలేదు. సాలిడ్ హిట్ కోసం ఈ అమ్మడు ఎదురుచూస్తుంది. సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది పెద్దగా యాక్టివ్ గా ఉండదు. అప్పుడప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది సురభి.

Surabhi

సురభి ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.