బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి దూసుకుపోతున్నారు మెగాస్టార్ . రీసెంట్ గా ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిరు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు వరుసగా మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించనున్నారు మెగాస్టార్. ఇప్పుడు గాడ్ ఫాదర్, బోళా శంకర్ సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి (Megastar Chiranjeevi). ఇవే కాకుండా.. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా టైటిల్ గురించి ఫిల్మ్ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా టైటిల్ వాల్తేరు వీరయ్య అన్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఆచార్య సినిమా ప్రమోషన్లలో భాగంగా మెగాస్టార్ సైతం ఈ సినిమా టైటిల్ వాల్తేరు వీరయ్య అని హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది.
వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ తో తలపడే విలన్ కోసం మలయాళ స్టార్ హీరోను రంగంలోకి దింపుతున్నారట. మలయాళ స్టార్ యాక్టర్ బిజు మీనన్ ను ఈ సినిమాకోసం సంప్రదిస్తున్నారట. బిజు మీనన్ కి తెలుగు సినిమాలు కొత్త కాదు .. విలనిజం కూడా కొత్తకాదు. గతంలో గోపీచంద్ నటించిన రణం సినిమాలో విలన్ గా నటించారు బిజు మీనన్. అలాగే రవి తేజ నటించిన ఖతర్నాక్ సినిమాలోనూ బిజు మీనన్ నటించారు. ఇప్పుడు మెగాస్టార్ కోసం బిజు మీనన్ రంగంలోకి దిగనున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..