డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ డైరెక్టర్స్.. అరెస్ట్ చేసిన పోలీసులు..

హైబ్రిడ్ డ్రగ్స్ సేవిస్తున్న ఇద్దరు దర్శకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో కొచ్చిలోని గోశ్రీ బ్రిడ్జి సమీపంలోని ఒక ఫ్లాట్ లో నిర్వహించిన దాడిలో కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరు దర్శకులు ఉన్నట్లు సమాచారం. ఎక్సైజ్ అధికారులు వారి నుంచి 1.6 గ్రాముల హైబ్రిడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ డైరెక్టర్స్.. అరెస్ట్ చేసిన పోలీసులు..
Khalid Rahman, Ashraf Hamza

Updated on: Apr 27, 2025 | 11:10 AM

కొచ్చిలోని ఓ ఫ్లాట్ లో గంజాయి తీసుకుంటున్న ఇద్దరు మలయాళీ డైరెక్టర్లు ఖలీద్ రెహమాన్, అష్రఫ్ హంజా సహా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారితో పాటు ఉన్న షలీఫ్ మహ్మద్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన కొచ్చిలోని ఒక ఫ్లాట్‌లో తెల్లవారుజామున జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ కేసులో అరెస్ట్ అయిన ఇద్దరు దర్శకులు ఇప్పుడు బెయిల్ పై విడుదలయ్యారు. అరెస్టయిన మూడవ వ్యక్తి షలీఫ్ మహ్మద్. ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు కొచ్చిలోని గోశ్రీ బ్రిడ్జి సమీపంలోని ఒక ఫ్లాట్‌లో నిర్వహించిన దాడిలో వీరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఎక్సైజ్ అధికారులు వారి నుండి 1.6 గ్రాముల హైబ్రిడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఫ్లాట్ సినిమాటోగ్రాఫర్ సమీర్ తాహిర్ కు చెందినదని తెలుస్తోంది. షలీఫ్ ఆ డైరెక్టర్లకు సన్నిహిత మిత్రుడు అని తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ వర్గాలకు అందిన రహస్య సమాచారం ప్రకారం ఈ దాడి జరిగిందట. ఖలీద్ అలప్పుజ మలయాళంలో జింఖానా, తల్లుమాల వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ఇక అష్రాఫ్ తమాషా భీమన్నంటే వాజి చిత్రాలను తెరకెక్కించారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఖలీద్, అష్రాఫ్ ఇద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వారిని బెయిల్‌పై విడుదల చేశారు. ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేయాలని ఎక్సైజ్ నిర్ణయించింది. ఖలీద్ తెరకెక్కించిన మొదటి సినిమా అనురాగ కరిక్కిన్ వెల్లం. 2016లో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక అష్రఫ్ హంజా చివరి చిత్రం సులైఖా మంజిల్. ఇది 2023లో విడుదలైంది. ఆయన తమాషా, భీమంటే వాళి చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు.

మరోవైపు హైబ్రిడ్ గంజాయి స్వాధీనం కేసులో మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఏప్రిల్ 28న విచారణకు హాజరు కావాలని ఎక్సైజ్ శాఖ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నటుడు శ్రీనాథ్ భాసికి నోటీసులు జారీ చేశారు. అంతకుముందు, ఏప్రిల్ 1న హైబ్రిడ్ గంజాయిని అమ్మినందుకు ఎక్సైజ్ అధికారులు ఇద్దరు వ్యక్తులను – తస్లీమా సుల్తానా అలియాస్ క్రిస్టినా, కె ఫిరోజ్ – అరెస్టు చేశారు. తస్లీమా భర్త సుల్తాన్ అక్బర్ అలీని కూడా అరెస్టు చేశారు. సుల్తానా ఇద్దరు నటులకు డ్రగ్స్ సరఫరా చేసిందని దర్యాప్తు బృందం అనుమానిస్తోంది.

ఇవి కూడా చదవండి :  

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..

OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..