Malayalam Actors : తెలుగు సినిమాల పై మక్కువ పంచుకుంటున్న మలయాళ నటులు

లాక్‌డౌన్‌ టైమ్‌లో సరిహద్దులు దాటేసి సత్తా చాటేశారు మల్లు స్టార్స్. చిన్న చిన్న కాన్సెప్టులతో సినిమాలు చేసి, సూపర్బ్ అనిపించుకున్నారు. డిజిటల్‌ మీడియమ్‌లో అమితాదరణ పొందిన ఫాహద్‌, దుల్కర్‌లాంటి వాళ్లకు తమ సినిమాల్లోనూ ఛాన్సులివ్వాలని ఫిక్స్ అయ్యారు మన మేకర్స్. తెలుగువారికి మలయాళ అనువాదం లూసిఫర్‌తో మరింత దగ్గరయ్యారు పృథ్విరాజ్‌. ప్రస్తుతం ప్రభాస్‌ సలార్‌లో నటిస్తున్న పృథ్వి, త్వరలోనే ప్రభాస్‌ని డైరక్ట్ చేస్తారనే మాటలూ వినిపిస్తున్నాయి. పార్టీ లేదా పుష్పా అనే మాట ఎక్కడ విన్నా వెంటనే గుర్తుకొచ్చేస్తున్నారు ఫాహద్‌ పాజిల్‌.

Malayalam Actors : తెలుగు సినిమాల పై మక్కువ పంచుకుంటున్న మలయాళ నటులు
Malayalam Actors

Edited By:

Updated on: Aug 19, 2023 | 1:39 PM

సినిమా ఏ భాషలో తీస్తున్నా, స్టార్స్ ఎవరైనా కచ్చితంగా మలయాళం హీరోల ప్రెజెన్స్ ఉండాల్సిందే అన్నట్టుంది పరిస్థితి. ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో ప్రాజెక్టులను ప్లాన్‌ చేస్తున్న మేకర్స్ అందరికీ సుపరిచితులైన మల్లు స్టార్స్ విషయంలోనూ ఫోకస్‌గానే ఉన్నారు. దుల్కర్‌, పృథ్వి, ఫాహద్‌, ఉన్ని.. ఇలా ఎవరో ఒకరు తమ సినిమాలో ఉండేలా జాగ్రత్తపడుతున్నారు.

ప్రభాస్‌ ప్రాజెక్ట్ కెలోనూ దుల్కర్‌ ఉన్నారంటూ వార్తలొస్తున్నాయి. సుధ కొంగర నెక్స్ట్ మూవీలో సూర్యతో పాటు దుల్కర్‌ కూడా హీరోగా నటిస్తారని టాక్‌.

ఫహద్ ఫాజిల్ ఇన్ స్టా గ్రామ్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి