Shine Tom Chacko: మొన్ననే ఎంగేజ్‌మెంట్.. ఇంతలోనే బ్రేకప్ .. ‘దసరా’ విలన్ ప్రేమ బంధానికి బీటలు

|

Aug 04, 2024 | 5:33 PM

ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఇప్పుడు ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే కనిపిస్తున్నాడు. న్యాచురల్‌ స్టార్‌ నాని నటించిన దసరా సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడీ హీరో కమ్‌ విలన్‌. ఇందులో క్రూరమైన ప్రతినాయకుడిగా నటించి ఆడియెన్స్ ను మెప్పించాడు. ఆ తర్వాత నాగ శౌర్య రంగబలి లోనూ విలన్‌గా ఆకట్టుకున్నాడు

Shine Tom Chacko: మొన్ననే ఎంగేజ్‌మెంట్.. ఇంతలోనే బ్రేకప్ .. దసరా విలన్ ప్రేమ బంధానికి  బీటలు
Shine Tom Chacko
Follow us on

ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఇప్పుడు ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే కనిపిస్తున్నాడు. న్యాచురల్‌ స్టార్‌ నాని నటించిన దసరా సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడీ హీరో కమ్‌ విలన్‌. ఇందులో క్రూరమైన ప్రతినాయకుడిగా నటించి ఆడియెన్స్ ను మెప్పించాడు. ఆ తర్వాత నాగ శౌర్య రంగబలి లోనూ విలన్‌గా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’లోనూ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. గత కొన్నాళ్లుగా ప్రేమ, రిలేషన్‌షిప్‌ విషయాలతో వార్తల్లో నిలుస్తున్నాడు షైన్‌ టామ్ చాకో. తనూజ అనే అమ్మాయితో ప్రేమలో మునిగి తేలిన అతను ఈ ఏడాది జనవరిలో తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించాడు. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. తమ ఎంగేజ్‌ మెంట్‌ ఫొటోల్ని కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. త్వరలో పెళ్లి తేదీని ప్రకటిస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో షాకింగ్ న్యూస్ చెప్పాడు టామ్ చాకో. తనూజాతో తన సంబంధం పెళ్లి కాకుండానే ముగిసిందని వెల్లడించాడు. ఈ క్రమంలోనే తన సోషల్ మీడియా ఖాతాల నుంచి తనూజాతో కలిసున్న ఫొటోలను తొలగించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. దీంతె వీరిద్దరూ విడిపోయినట్లేనని అభిమానులు చర్చించుకుంటున్నారు.

తనూజాతో తన రిలేషన్ షిప్ పై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు షైన్ టామ్ చాకో. ప్రస్తుతం తాను మళ్లీ ‘సింగిల్‌’ అంటూ తన బ్రేకప్ వార్తల్ని ఖరారు చేశాడు. ‘తనూజాతో నా బంధం కలుషితంగా మారింది. ఇద్దరి మధ్య ఒకరినొకరికి ప్రేమ ఉన్నప్పటికీ కలిసి కొనసాగలేకపోయాం. ప్రస్థుతం నేను మళ్లీ డేటింగ్ యాప్‌పై దృష్టి పెట్టాను. నచ్చిన యువతి కోసం వెతుకుతున్నాను. నాకు ఇష్టమైన అమ్మాయిని ఎంపిక చేసుకోవడంలోనూ, వారిని ఒప్పించడంలోనూ చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి’ అని చెప్పుకొచ్చాడీ మలయాళం యాక్టర్.

ఇవి కూడా చదవండి

సినిమా ప్రమోషన్లలో నటుడు షైన్ టామ్ చాకో..

షైన్ టామ్ చాకోకు తబితా మాథ్యూస్ అనే భార్య ఉంది. వీరికి కూతురు కూడా ఉంది. అయితే వారిద్దరూ గతంలోనే విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

షైన్ టామ్ చాకో లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి..