AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు పిచ్చెక్కించే గ్లామరస్ హీరోయిన్.. ప్రభాస్‌తో సినిమా చేస్తోంది

పై ఫొటోలో ఎలాంటి మేకప్ లేకుండా న్యాచురల్ లుక్ తో క్యూట్ గా కనిపిస్తున్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడామె సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ గ్లామరస్ హీరోయిన్. ఆమె సినిమా ఇండస్ట్రీకి వచ్చి సుమారు పదేళ్లవుతోంది. కానీ పట్టుమని పది సినిమాలు కూడా చేయలేదు. కానీ ఎక్కువగా బిగ్ అండ్ క్రేజీ ప్రాజెక్టుల్లోనే ఎక్కువగా నటించింది. చేసింది తక్కువ సినిమాలే అయినా తన క్యూట్ లుక్స్ తో కుర్రకారును ఫిదా చేసిందీ బ్యూటీ

Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు పిచ్చెక్కించే గ్లామరస్ హీరోయిన్.. ప్రభాస్‌తో సినిమా చేస్తోంది
Tollywood Actress
Basha Shek
|

Updated on: Aug 04, 2024 | 4:59 PM

Share

పై ఫొటోలో ఎలాంటి మేకప్ లేకుండా న్యాచురల్ లుక్ తో క్యూట్ గా కనిపిస్తున్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడామె సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ గ్లామరస్ హీరోయిన్. ఆమె సినిమా ఇండస్ట్రీకి వచ్చి సుమారు పదేళ్లవుతోంది. కానీ పట్టుమని పది సినిమాలు కూడా చేయలేదు. కానీ ఎక్కువగా బిగ్ అండ్ క్రేజీ ప్రాజెక్టుల్లోనే ఎక్కువగా నటించింది. చేసింది తక్కువ సినిమాలే అయినా తన క్యూట్ లుక్స్ తో కుర్రకారును ఫిదా చేసిందీ బ్యూటీ. ఇప్పటివరకు ఎక్కువగా కన్నడ, మలయాళ, తమిళ సినిమాల్లోనే ఎక్కువగా సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే నేరుగా ఒక తెలుగు సినిమాలో యాక్ట్ చేయనుంది. అది కూడా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో కలిసి. మరి ఈ నటి ఎవరో ఈపాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది. యస్. ఆమెమరెవరో కాదు మలయాళ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్. ఆదివారం (ఆగస్టు 04) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మాళవికకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇక ప్రభాస్ సినిమా ‘ది రాజా సాబ్’లోనూ ఈ బ్యూటీ బర్త్ డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ప్రస్తుతం అందుకు సంబంధించి న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

మాళవిక ప్రముఖ సినిమాటోగ్రాఫర్ KU మోహనన్ కుమార్తె. ‘డాన్’, ‘తలాష్’, ‘ఫుక్రీ’ ‘రయీస్’ తదితర హిట్ సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఇక మాళవిక కేరళలోని కన్నూర్ జిల్లా పయ్యనూర్‌లో జన్మించింది. ముంబైలో పెరిగింది. ‘నిర్ణయకం’ అనే కన్నడ సినిమాలో నటించి మంచి పాపులారిటీని అందుకుందీ ముద్దుగుమ్మ. ‘నాను మట్టు వరలక్ష్మి’, ‘బియాండ్ ది క్లౌడ్స్’, పేట, తదితర సినిమాల్లో నటించింది. అలాగే రజనీకాంత్ విజయ్, ధనుష్ మూవీస్ పేట, మాస్టర్, మారన్‌లో కనిపించింది. క్రిస్టి అనే మలయాళ మూవీ లోనూ నటించింది. ప్రస్తుతం ప్రభాస్ – మారుతి కాంబోలో వస్తున్న ది రాజా సాబ్ మూవీతో టాలీవుడ్ ఇంట అడుగుపెడుతోంది. అంతేకాకుండా తంగలాన్, యోధ్రా వంటి హిందీ చిత్రాలు మాళవిక చేతిలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ది రాజా సాబ్ సెట్ లో మాళవికా మోహనన్ బర్త్ డే వేడుకలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి..

Follow Us
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్