AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna : ఆయన తినే రైస్ మనం తినలేం.. నాగార్జున డైట్ ప్లాన్ చెప్పిన మేకప్ మెన్..

ఆరుపదుల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు హీరో నాగార్జున. ఇప్పటికీ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యం, యువతరం జీవనశైలి వెనుక ఉన్న రహస్యాలను పంచుకున్నారు నాగార్జున మేకప్ మ్యాన్ చంద్ర. ఆయన డైట్ పద్ధతులు, జిమ్ దినచర్య, ఉసిరి, క్యారెట్ జ్యూస్ వంటి జుట్టు సంరక్షణ చిట్కాలు, అలాగే పమ్ఫ్రట్ చేపల పట్ల ఇష్టాన్ని వివరించారు. ఈ వివరాలు ఆయన అద్భుతమైన ఫిట్‌నెస్‌కు కారణాలుగా నిలుస్తాయి.

Nagarjuna : ఆయన తినే రైస్ మనం తినలేం.. నాగార్జున డైట్ ప్లాన్ చెప్పిన మేకప్ మెన్..
Nagarjuna
Rajitha Chanti
|

Updated on: Jul 03, 2026 | 1:44 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో కింగ్ నాగార్జున స్థానం ప్రత్యేకమైనది. ఆయన వయస్సు పెరుగుతున్నా, యువ హీరోలకు దీటుగా ఫిట్‌గా, ఉత్సాహంగా కనిపిస్తారు. ఆయన ఆరోగ్యం, యవ్వన జీవనశైలి వెనుక ఉన్న రహస్యాలను ఆయనకు చాలా కాలంగా మేకప్ మ్యాన్‌గా పనిచేసిన చంద్ర వెల్లడించారు. నాగార్జున లైఫ్‌స్టైల్, శరీర నిర్వహణ, ఆహారపు అలవాట్లు చాలా మందికి ఆదర్శంగా నిలుస్తాయని చంద్ర పేర్కొన్నారు. వారం రోజుల్లో ఐదు రోజులు నాగార్జున మామూలు ఆహారాన్నే తీసుకుంటారని చంద్ర వివరించారు. అయితే, ఆయన అతిగా తినకుండా, చాలా మితంగా తీసుకుంటారు. ఉదయం అల్పాహారంలో ఒక ఇడ్లీ, లేదా ఒక వడ, లేదా ఒక గారె మాత్రమే తింటారు. ఆకలిగా ఉన్నప్పుడే ఆహారం తీసుకుంటారని, ఆకలి లేనిదే తినరని చంద్ర తెలిపారు. మధ్యాహ్న భోజనంలో కూడా నాగార్జున ప్రత్యేకమైన ఆహార నియమాలు పాటిస్తారు. ఆయన భోజనంలో ప్రతిరోజు బెండకాయ కూర తప్పనిసరిగా ఉండాలి. హాట్ చిప్స్ కూడా తీసుకుంటారు. అన్నం విషయంలో దంపుడు బియ్యాన్ని (పొట్టు తీయని, తవుడు తొలగించని బియ్యం) ఇష్టపడతారు. దీనితో పాటు రసం, ఒక అరటిపండు కూడా ఉంటాయి. ఈ ఐదు రకాల పదార్థాలను చిన్న చిన్న పరిమాణంలో తీసుకుంటారు. ముఖ్యంగా, ఆయనకు అన్నం బాగా మెత్తగా, చిమిడిపోయినట్లు ముద్దగా ఉండటం ఇష్టం. మనం తినడానికి కష్టంగా ఉండేంత మెత్తగా అన్నం ఉండాలని ఆయన కోరుకుంటారని చెప్పుకొచ్చారు.

శనివారం రాత్రి నాగార్జునకి పమ్ఫ్రట్ చేప (తెలుగులో చందువ చేప) అంటే చాలా ఇష్టం. ఔట్‌డోర్ షూటింగ్‌లకు వెళ్లినప్పుడు కూడా చంద్ర గారు ఆయన కోసం స్వయంగా ఈ చేపను వండి పెట్టేవారు. ఈ చేపను ప్రత్యేక పద్ధతిలో తయారుచేస్తారు. సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం, మిరియాల పొడిని (కారం బదులు) ఆలివ్ ఆయిల్‌లో నానబెట్టి, చేపపై వేసి కాల్చుతారు. మామూలుగా వాడే పసుపు, అల్లం ముద్ద వంటివి వాడరు. ఈ వంటకాన్ని నాగార్జున ఎంతో ఇష్టంగా, ఒక్కోసారి ఒకటి రెండు చేపలు కూడా తింటారని చంద్ర తెలిపారు. రొయ్యలు, ఇతర సీఫుడ్‌ను నాగార్జున ఇష్టపడరు. ఆదివారం మాత్రం మటన్ లేదా చికెన్ రెండు మూడు ముక్కలు మాత్రమే తీసుకుంటారు. ఆదివారం రోజు కాస్త ఎక్కువ తింటారని చంద్ర గారు ఊహించారు.

నాగార్జున నిత్యం జిమ్ చేస్తారు. ఇది ఆయన ఫిట్‌నెస్‌కు మూలస్తంభం. జిమ్‌తో పాటు, ఆయన ఉదయం పరగడుపున ఒక పెద్ద రాగి గ్లాసు నిండా ఒక ప్రత్యేకమైన జ్యూస్‌ను తాగుతారు. ఈ జ్యూస్‌లో నిమ్మకాయ, ఉసిరికాయ, క్యారెట్, బీట్‌రూట్, తెల్ల పటికబెల్లం ముక్క లేదా తేనె ఉంటాయి. ఈ పదార్థాలన్నింటినీ మిక్సీ పట్టి జ్యూస్‌గా తయారుచేసి, షూటింగ్‌కు రాగానే మొదటగా నాగార్జునకు ఇచ్చేవారట చంద్ర. ఈ జ్యూస్ తాగడమే నాగార్జున జుట్టు రాలకుండా ఉండటానికి ప్రధాన రహస్యం అని చంద్ర స్పష్టం చేశారు. ఉసిరికాయ, క్యారెట్ వంటివి జుట్టు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఈ క్రమశిక్షణను ఎవరూ పాటించలేరని, నాగార్జున పాటిస్తారు కాబట్టే ఆయన జుట్టు అద్భుతంగా ఉందని చంద్ర వివరించారు. నాగార్జున కెరీర్‌లో అన్నమయ్య సినిమాకు మాత్రమే విగ్ వాడారని, అది కూడా పాత వయస్సు, మధ్య వయస్సు గెటప్‌ల కోసం మాత్రమేనని చంద్ర తెలిపారు. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం సినిమాకు మొదట విగ్ పెట్టినా, తర్వాత బాగుండదని తీసేసినట్లు గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..

Follow Us