Guntur Kaaram: మహేష్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్ చెప్పిన మేకర్స్.. ‘గుంటూరు కారం’ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..

సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు మేకర్స్. ఇప్పుడు విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్రయూనిట్. ఇప్పటికే సాంగ్స్, టీజర్ రిలీజ్ చేస్తూ మూవీపై హైప్ పెంచేశారు. అలాగే మహేష్ ఫ్యాన్స్ ట్విట్టర్ ఖాతాలలో నిత్యం లేటేస్ట్ ఫోస్టర్స్ షేర్ చేస్తూ సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నారు. ఇప్పటికే యూఎస్‏లో ప్రీబుకింగ్స్ హవా కొనసాగుతుంది. ఇక కొద్దిరోజులుగా గుంటూరు కారం ట్రైలర్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు

Guntur Kaaram: మహేష్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్ చెప్పిన మేకర్స్.. గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే..
Guntur Kaaram

Updated on: Jan 07, 2024 | 11:01 AM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తోన్న లేటేస్ట్ సినిమా ”గుంటూరు కారం’. సూపర్ స్టార్ మహేష్ బాబు, మీనాక్షి చౌదరీ, శ్రీలీల ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు మేకర్స్. ఇప్పుడు విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ వేగం పెంచింది చిత్రయూనిట్. ఇప్పటికే సాంగ్స్, టీజర్ రిలీజ్ చేస్తూ మూవీపై హైప్ పెంచేశారు. అలాగే మహేష్ ఫ్యాన్స్ ట్విట్టర్ ఖాతాలలో నిత్యం లేటేస్ట్ ఫోస్టర్స్ షేర్ చేస్తూ సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నారు. ఇప్పటికే యూఎస్‏లో ప్రీబుకింగ్స్ హవా కొనసాగుతుంది. ఇక కొద్దిరోజులుగా గుంటూరు కారం ట్రైలర్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ఈ ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉండగా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడడంతో.. ట్రైలర్ రిలీజ్ ఆగిపోయింది. దీంతో ఎప్పుడెప్పుడు ట్రైలర్ అప్డేట్ షేర్ చేస్తారా ?.. అని వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అభిమానుల నిరీక్షణకు తెర దించారు.

కాసేపటి క్రితమే గుంటూరు కారం ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈరోజు ఆదివారం గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. కానీ సమయం మాత్రం తెలియజేయలేదు. దీంతో మరోసారి ట్రైలర్ రిలీజ్ పై సస్పెన్స్ మెయింటెన్ చేస్తున్నారు. మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు కీలకపాత్రలు పోషిస్తుండగా..థమన్ సంగీతం అందిస్తున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. దీంతో గుంటూరు కారం చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఓవర్సీస్ లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఒక్క అమెరికాలోనే ఈ మూవీకి సంబంధించి 5వేలకు పైగా ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఇప్పటికే అమెరికాలో ప్రీ సెల్స్ సెన్సెషన్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.