‘UI’ OTT : ఓటీటీలోకి ఉపేంద్ర ‘యుఐ’ సినిమా.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్

|

Jan 08, 2025 | 7:55 PM

ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన సినిమా యూఐ. రిలీజ్ కు ముందే ఆసక్తిరేపిన ఈ సినిమా డిసెంబర్ 20న గ్రాండ్ పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదలైంది. అంచనాలకు తగ్గట్టుగానే మంచి కలెక్షన్లు రాబట్టింది.

UI OTT : ఓటీటీలోకి  ఉపేంద్ర యుఐ సినిమా.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్
Ui
Follow us on

ఉపేంద్రకు కన్నడతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో తెరకెక్కే ఆయన సినిమాలకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా ఉపేంద్ర యుఐ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఉపేంద్ర దర్శకత్వం వహించిన ‘యుఐ’ చిత్రం డిసెంబర్ 20న విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. ‘యూఐ’ విడుదలైన మొదటి వారంలోనే మంచి కలెక్షన్లు సొంతం చేసుకుంది. కర్ణాటకలోనే కాకుండా విదేశీ భాషల్లోనూ ‘యూఐ’ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టిందని మేకర్స్ అంటున్నారు. ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ కాకపోయినా ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టిందని అంటున్నారు.

తెలుగులోనూ ఉపేంద్ర సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇదిలా విడుదలైన  కొన్ని రోజులకే ‘యూఐ’ సినిమా ఓటీటీలో విడుదల కానుందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. సౌత్ ఇండియాలో ప్రత్యేకించి తమిళం, తెలుగు భాషల్లో పాపులర్ అయిన సన్ నెక్స్ట్ ఓటీటీలో జనవరి రెండో వారంలో ‘యుఐ’ సినిమా విడుదలవుతుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఉపేంద్ర సుదీప్ నటించిన ‘ముకుంద-మురారి’ చిత్రం సన్ నెక్స్ట్ OTTలో ప్రసారం అవుతోంది. కాబట్టి సన్ నెక్స్ట్‌లోనే ‘యుఐ’ సినిమా కూడా రిలీజ్ అవుతుందని చాలా మంది అభిమానులు నమ్మారు.

ఇది కూడా చదవండి : 8th క్లాస్‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తే.. ఎండ్ అయ్యేసరికి ఇంటర్ అయిపొయింది.. ఆర్ఆర్ఆర్ మల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

అయితే ఇప్పుడు దీనిపై ‘యూఐ’ చిత్ర నిర్మాతల్లో ఒకరైన కేపీ శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు. శ్రీకాంత్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. ‘UI’ చిత్రం OTT హక్కులను సన్ నెక్స్ట్ కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇది ఫేక్ న్యూస్. సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేయడం లేదా విడుదల చేయడంపై చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసే వరకు, ఇలాంటి ఫేక్ వార్తలను ఎవరూ నమ్మొద్దు. అధికారిక ప్రకటనను చిత్ర బృందం స్వయంగా ప్రకటిస్తుంది అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : కోయ్.. కోయ్.. కేక పెట్టించిందిరోయ్..! దృశ్యం సినిమాలో వెంకీ చిన్న కూతురు గత్తర లేపిందిగా..!

కన్నడలో కిచ్చ సుదీప్ నటించిన ‘మ్యాక్స్’ సినిమా రిలీజ్ అవ్వడంతో ఆ సినిమాపై వచ్చిన హైప్ కారణంగా చాలా మంది ఉపేంద్ర అభిమానులు, సినీ ప్రేమికులు ‘యూఐ’ సినిమాను థియేటర్లలో చూసే అవకాశాన్ని కోల్పోయారు. అందుకే ఓటీటీలో సినిమా చూసేందుకు చాలా మంది ఎదురుచూస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఉపేంద్ర దర్శకత్వం వహించిన చిత్రం కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో రీష్మా నానయ్య  హీరోయిన్ గా నటించింది. అజనీష్ లోక్‌నాథ్ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .