AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu : మరోసారి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్.. హాట్ టాపిక్ గా సూపర్ స్టార్ వాట్సాప్ డీపీ..

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకుమారుడు  సినిమాతో హీరో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాలనటుడిగాను ఎన్నో సినిమాల్లో నటించాడు.

Mahesh Babu : మరోసారి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్.. హాట్ టాపిక్ గా సూపర్ స్టార్ వాట్సాప్ డీపీ..
Lion King Dp
Rajeev Rayala
|

Updated on: Mar 24, 2021 | 8:26 AM

Share

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకుమారుడు  సినిమాతో హీరో ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాలనటుడిగాను ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇక మహేష్ సినిమా వస్తుందంటే చాలా అభిమానులు ఆనందంలో తేలిపోతారు. సినిమా రిలీజ్ అయ్యిందంటే ఫ్యాన్స్ కు పండగే. అలాగే సోషల్ మీడియాలోనూ మహేష్ కు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇక మహేష్ సినిమా నుంచి కానీ వ్యక్తిగత విషయాలగురించి కానీ ఏ చిన్న విషయం లీక్ అయిన సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హల్ చల్ చేస్తుంటారు.

ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు వాట్సాప్ డీపీ నెట్టింట  హడావిడి చేస్తుంది. ఇటీవల కింగ్ నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా ట్రైలర్ పై స్పందిస్తూ మహేష్ నాగ్ పైన సినిమా ట్రైలర్ పై ప్రశంసలు కురిపించాడు. అయితే నాగార్జున మహేష్ బాబు వాట్సాప్ చాట్ ను నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేసారు. దాంతో మహేష్ వాట్సాప్ డీపీ ఫ్యాన్స్ కంట పడింది దాంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరు అదే డీపీని తమ వాట్సాప్ ప్రొఫైల్ కు పెట్టుకున్నారు. తాజాగా మరో సారి మహేష్ వాట్సాప్ డీపీ నెట్టింట వైరల్ అవుతుంది.

మహేష్ నటించిన మహర్షి సినిమాకు రెండు జాతీయ అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మహర్షి సినిమాకు నేషనల్ అవార్డు వస్తుందని 2017లోనే మహేష్ చెప్పాడని ఓ స్క్రీన్ షాట్ ను షేర్ చేసాడు వంశీ పైడిపల్లి. ‘ఊపిరి’ చిత్రానికి ఫిలిం ఫేర్ అవార్డు రావడంపై వంశీకి శుభాకాంక్షలు తెలుపుతూ మహేష్ వాట్సాప్ మెసేజ్ చేశారు. నెక్స్ట్ సినిమాకు జాతీయ గౌరవం అందుకుంటావని మహేష్ పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ చాట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా మహేష్ డీపీ పై మరోసారి చర్చ మొదలైంది. మహేష్ ప్రస్తుతం సర్కారువారి పాట సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు . పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Urvashi Rautela: భారీ డ్రెస్ లో మెరిసిన అందాల ఊర్వశి.. ఫ్యాషన్ కోసం తప్పదంటున్న బ్యూటీ

‘సలార్’ కాంబినేషన్‏లో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సినిమా !! మరో పాన్ ఇండియా సినిమా కోసం సన్నాహాలు..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!