క్రేజ్‌లోనైనా.. !రేంజ్‌లోనైనా..! స్టార్ డమ్‌లోనైనా..! ఫ్యాన్స్ బేస్‌లో అయినా..! మహేష్.. మహేషే! అలాంటి మహేష్ ఇప్పుడు అందర్లో ఎక్కడలేని క్యూరియాసిటీని పెంచేస్తున్నారు. ఆపుకోలేనంత ఎగ్జైట్ మెంట్ కలిగిస్తున్నారు. నయా నయా పోస్టర్లతో.. అందర్లో హై ని సెట్ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో తన ఎస్.ఎస్.ఎమ్.బీ28 నుంచి టైటిల్ పోస్టర్ రిలీజ్ అవనున్న వేళ.. తన న్యూ పోస్టర్‌తో నెట్టింట సెగలు పుట్టిస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. దానికి తోడు.. అదే పోస్టర్‌కు ప్రిన్స్ ఫ్యాన్స్ తమ ఫోటో షాప్ టెక్నిక్స్ యాడ్ చేస్తూ.. మెరుగులు దిద్దుతుండడంతో.. నెట్టింట వైరస్తోల్ అవుతున్నారు.
మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తోన్న విషయం తెలిసిందే. అతడు, ఖలేజా సినిమా తర్వాత ఈ క్రేజీ కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూవీ రాబోతోంది. ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇటీవలే ఈ సినిమా నుంచి ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మాహేష్ బాబు ప్రీ లుక్ ను రిలీజ్ చేసి అభిమానులకు పూనకాలు తెప్పించారు చిత్రయూనిట్. దాదాపు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో మహేషే నెంబర్ 1గా ట్రెండ్ అవుతున్నారు. కృష్ణ మోసగాళ్లకు మోసగాడు.. కటౌట్స్ లోనూ.. సీనియర్ సూపర్ స్టార్ పక్కనే కనిపిస్తూ.. అటు పెద్దాళ్లను కూడా ఫిదా చేస్తున్నారు ఫ్రిన్స్.!ఈ సినిమాలో మహేష్ సరసన ఇద్దరు భామలు నటించనున్నారు. పూజాహెగ్డే, శ్రీలీల ఈ మూవీ హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.
The Thunderous #SSMB28MassStrike arrives in just 2 Days ??
Our Beloved SUPER FANS to launch at the theatres near you on May 31st ?
Super ? @urstrulyMahesh #Trivikram @hegdepooja @sreeleela14 @MusicThaman @vamsi84 #PSVinod @NavinNooli #ASPrakash pic.twitter.com/KK48BOrUgG
— Haarika & Hassine Creations (@haarikahassine) May 29, 2023