Okkadu: మహేష్ బాబా.. మజాకా.. రీరిలీజ్‌లోనూ కుమ్మేసిన ఒక్కడు.. మొత్తంగా ఎంత వసూల్ చేసిందంటే

|

Jan 25, 2023 | 8:37 AM

రీసెంట్ గా మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా కూడా రీ రిలీజ్ అయ్యింది. మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఒక్కడు గురించి ఎంత చెప్పిన తక్కువే..

Okkadu: మహేష్ బాబా.. మజాకా.. రీరిలీజ్‌లోనూ కుమ్మేసిన ఒక్కడు.. మొత్తంగా ఎంత వసూల్ చేసిందంటే
Okkadu
Follow us on

ఇటీవల సినిమా ఇండస్ట్రీలో నయా ట్రెండ్ ఒకటి చక్కర్లు కొడుతోంది. అదే రీ రిలీజ్.. స్టార్ హీరోల ఓల్డ్ సూపర్ హిట్ సినిమాలు మరోసారి థియేటర్స్ లో సందడి చేసి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. గతంలోనూ ఇది ఉన్నప్పటికీ.. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన పోకిరి సినిమానుంచి ఈ ట్రెండ్ ఊపందుకుంది. ఈ క్రమంలో చాలా సినిమాలు వచ్చాయి. అలాగే రీసెంట్ గా మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా కూడా రీ రిలీజ్ అయ్యింది. మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఒక్కడు గురించి ఎంత చెప్పిన తక్కువే.. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మహేష్ కెరీర్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది ఈ మూవీ. అప్పటి వరకు లవర్ బాయ్ గా ఉన్న మహేష్ ను ఒక్కడు సినిమా మాస్ హీరోగా మార్చేసింది.

ఇక రీసెంట్ గా రీ రిలీజ్ అయ్యింది ఒక్కడు. కొత్త ఏడాది పురస్కరించుకొని ఒక్కడు సినిమాను జనవరి 7న రిలీజ్ అయ్యింది. సినిమా వచ్చి దాదాపు 20 ఏళ్ళు దాటినా ఇప్పటికి అదే క్రేజ్ ఉంది ఈ మూవీ. తాజాగా రీ రిలీజ్ ఆయన ఒక్కడు మరోసారి రికార్డు క్రియేట్ చేసింది. ఒక్కడు సినిమా రిలీజ్ సందర్భంగా మహేష్ అభిమానులు థియేటర్స్ దగ్గర సందడి చేశారు. కొత్త సినిమాకు చేసినంత హడావిడి చేశారు ఫ్యాన్స్.

నైజాం 1.40 కోట్లు, సీడెడ్ 0.36 కోట్లు, ఆంధ్ర 1.19 కోట్లు, ఏపీ, తెలంగాణ కలిపి 2.95 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.22కోట్లు,ఇక వరల్డ్ వైడ్ గా 3.17 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే ఈ సినిమా కేవలం మూడు రోజుల్లో మాత్రమే ఇంత వసూల్ చేసింది. అలాగే ఈ సినిమా అంతగా ప్రమోషన్స్ కూడా జరగలేదు. అలాగే ఓవర్సీస్ లో కూడా రిలీజ్ కాలేదు. అక్కడ కూడా అయ్యిఉంటే ఈ కలెక్షన్స్ డబుల్ అయ్యేవి అంటున్నారు ఫ్యాన్స్.