
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా కోసం మహేష్ బాబు అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కామినేషన్ లో మూవీ రానుంది. పైగా మహేష్ బాబు కంప్లీట్ మాస్ మసాలా అవతార్ లో కనిపించనున్నారు. ఈ మధ్య కాలంలో మహేష్ బాబు ఇంత మాస్ గా కనిపించలేదు. దాంతో ఫ్యాన్స్ గుంటూరు కారం పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మేకర్స్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇక తాజాగా గుంటూరు కారం సినిమానుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు.
ధమ్ మాసాల బిరియాని అంటూ సాంగ్ మాస్ సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. తమన్ సంగీతం అందించగా.. రిరామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. సంజిత్ హేగ్డ్ ఆలపించారు. ఈ సాంగ్ ఇప్పుడు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. థియేటర్స్ లో దుమ్మురేగడం ఖాయం అంటున్నారు అభిమానులు.
గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి కనిపించనుంది. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ, చిన్నబాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో మహేష్ బాబు మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు.
Witness the ULTIMATE EXPLOSION of SUPER 🌟 @urstrulyMahesh in MASS SWAG 🔥💥#GunturKaaram First Single ~ #DumMasala Out Now 🔥
A @MusicThaman Musical 🎹🥁
✍️ @ramjowrites
🎤 #SanjithHegde #JyotiNooran#Trivikram #thaman @sreeleela14… pic.twitter.com/9dhFSQkZvP— Haarika & Hassine Creations (@haarikahassine) November 7, 2023
Lighting the way to a great year ahead!! #HappyDussehra #GunturKaaram 🔥 pic.twitter.com/sbku7utNXT
— Mahesh Babu (@urstrulyMahesh) October 23, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.