Mahesh Babu: మేనల్లుడితో మహేష్ బాబు సినిమా ?.. సర్కారు వారి పాటలో హీరో సుధీర్ బాబు తనయుడు..

|

Feb 11, 2022 | 2:47 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమాలో

Mahesh Babu: మేనల్లుడితో మహేష్ బాబు సినిమా ?.. సర్కారు వారి పాటలో  హీరో సుధీర్ బాబు తనయుడు..
Mahesh
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తుండగా.. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే సర్కారు వారి పాట నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఇందులో మహేష్ సరికొత్త లుక్‏లో కనిపించనున్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో మహేష్ బాబుకు మోకాలి సర్జరీ కావడం.. ఆతర్వాత కీర్తి సురేష్, మహేష్ కరోనా బారిన పడడంతో మూవీ షూటింగ్ ఆలస్యం అయ్యింది. అలాగే ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా సర్కారు వారి పాట నుంచి ఫస్ట్ సింగిల్ కళావతి పాటను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో మహేష్ మేనల్లుడు.. హీరో సుధీర్ బాబు తనయుడు చరిత్ కీలకపాత్రలో కనిపించబోతున్నాడట. అంతేకాకుండా.. ఈ మూవీలో చరిత్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‏గా ఉంటుందట. ఈ సినిమాతో చరిత్ చైల్డ్ ఆర్టిస్ట్‏గా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. గతంలో మహేష్ బాబు తనయుడు గౌతమ్ కూడా 1 నేనొక్కడినే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే గౌతమ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సర్కారు వారి పాట వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Pushpa: తగ్గేదేలే అంటున్న యుజ్వేంద్ర చాహల్.. వైరల్‌గా మారిన స్పిన్నర్ ఇన్‌స్టారీల్‌ వీడియో..

Alia Bhatt: నా పెళ్లి ఎప్పుడో అయిపొయింది.. షాక్ ఇచ్చిన అలియా భట్

Malli Modalaindi Review: మళ్లీ మొదలైన సుమంత్ మ్యాజిక్.. మంచి ఫీల్ ఉన్న మూవీ..

Kangana Ranaut: హిజాబ్ వివాదంపై కంగనా సంచలన వ్యాఖ్యలు.. మీరు ధైర్యం చూపించాలనుకంటే..