లుక్స్ విషయంలో మహేష్ బాబు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నే ఉంటారు. సూపర్ స్టార్ స్టైలీష్ లుక్స్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రిన్స్ నయా లుక్స్ నెట్టింట తెగ వైరలవుతుంటాయి. తన ప్రతి సినిమాకు మహేష్ లుక్ మారుస్తుంటారు. సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహేష్.. ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే హైప్ క్రియేట్ అయ్యింది. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. తాజాగా నెట్టింట మహేష్ కు సంబంధించిన ఓ లేటేస్ట్ ఫోటో హల్చల్ చేస్తుంది.
ఇటీవల తన తండ్రి కృష్ణ మరణించడంతో విరామం తీసుకున్నారు మహేశ్. తండ్రి అంత్యక్రియలు, చిన్న కర్మ, తండ్రి అస్థికలు విజయవాడ వద్ద కృష్ణా నదిలో కలపడం, పెద్దకర్మ తదితర కార్యక్రమాలు ముగియడంతో మళ్లీ పనిలో అడుగుపెట్టారు. బ్యాక్ టు వర్క్ అంటూ ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్టింట ఓ ఫోటో షేర్ చేసుకున్నారు. అంతేకాదు తన లేటెస్ట్ పిక్ ను కూడా మహేశ్ బాబు పంచుకున్నారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ సురేశ్ నటరాజన్ తీసిన ఆ ఫొటోలో మహేశ్ బాబు షార్ప్ లుక్స్ తో కనిపిస్తున్నారు.
ఈ క్రమంలోనే సూపర్ స్టార్ న్యూలుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అయితే మహేష్ ఓ కంపెనీకి చెందిన యాడ్ లో కనిపిస్తున్నట్లుగా సమాచారం. ఇక ప్రిన్స్ లేటేస్ట్ లుక్ చూసి పర్ఫెక్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా.. మహేష్ తిరిగి త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో పాల్గొనున్నట్లు తెలుస్తోంది.
Back to work!!
? : #SureshNatarajan pic.twitter.com/mHODeOiBpr
— Mahesh Babu (@urstrulyMahesh) December 3, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.