తెలంగాణ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంత విడాకులు తీసుకోవడానికి కారణం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై తెలుగు చిత్రపరిశ్రమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అక్కినేని నాగార్జున, అమల, నాగచైతన్య, సమంత, వెంకటేశ్, మెగాస్టార్ చిరంజీవి, నాని, ఆర్జీవీ రియాక్ట్ అయ్యారు. తాజాగా మహేష్ బాబు, రవితేజ, మంచు మనోజ్, సంయుక్త మీనన్, తేజ సజ్జా ట్విట్టర్ వేదికగా స్పందించారు. కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని.. ఒక కుమార్తెకు తండ్రిగా, ఒక భార్యకు భర్తగా.. ఒక తల్లికి కుమారుడిగా ఒక మహిళా మంత్రి మరో మహిళపై చేసిన కామెంట్స్ ఆమోదయోగ్యం కాదని అన్నారు.
“మా సినీ కుటుంబానికి చెందిన ప్రముఖులపై మంత్రి కొండ సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు నన్నెంతో బాధించాయి. ఒక కుమార్తెకు తండ్రిగా, ఒక భార్యకు భర్తగా, ఒక తల్లికి కుమారుడిగా ఒక మహిళా మంత్రి మరో మహిళపై చేసిన ఈ ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు తీవ్రంగా కలచివేశాయి. ఇతరుల మనోభావాలను దెబ్బతీయనంత వరకూ వాక్ స్వేచ్చను ఉపయోగించుకోవచ్చు. మీరు చేసిన ఈ నిరాధారమైన ఆరోపణలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే సినీ రంగాన్ని టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేయొద్దని కోరుతున్నాను. మన దేశంలో ఉన్న మహిళలతోపాటు సినీ ప్రముఖులను గౌరవమర్యాదలతో చూడాలి ” అంటూ ట్వీట్ చేశారు.
రవితేజ ట్వీట్..
“రాజకీయ యుద్ధం పేరుతో గౌరవప్రదమైన వారిపై ఓ మహిళా మంత్రి నీచమైన ఆరోపణలు చేయడం నన్ను భయాందోళనకు గురిచేసింది. ఇది అవమానకరమైన చర్య. తమ రాజకీయ శత్రుత్వాల్లోకి అమాయక వ్యక్తులను, ముఖ్యంగా మహిళను లాగకూడదు. సామాజిక విలువలు పెంచుతూ రాజకీయ నాయకులు అందరికీ స్పూర్తిగా నిలవాలి..” అంటూ ట్వీట్ చేశారు.
మంచు మనోజ్ ట్వీట్..
“మంత్రి కొండా సురేఖ గారి నుంచి ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు వినడం బాధాకంర. అధికారంలో ఉన్న మహిళగా, ఏ రంగంలోనైనా మహిళలు విజయం సాధించడం ఎంత కష్టంతో కూడుకున్నదో మీరు అర్థం చేసుకోవాలి. రాజకీయ లబ్ది కోసం సినీతారల వ్యక్తిగత జీవితాలపై స్త్రీ ద్వేషం, తప్పుడు ఆరోపణలు చేయడం సరైనది కాదు. తన పార్టీలోని నాయకులు ఇలాంటి వాటికి దూరంగా ఉండేలా రాహుల్ గాంధీ దృష్టి సారించాలని కోరుతున్నాను. ఇలాంటివి మళ్లీ జరగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వ్యక్తిగత ధూషణలను చిత్రపరిశ్రమ ముక్త కంఠంతో ఖండిస్తుంది” అంటూ ట్వీట్ చేశారు.
సంయుక్త మీనన్ ట్వీట్..
“ఇది ఆమోదయోగ్యం కానీ విషయం. చాలా ఇబ్బందికరంగా అనిపించింది. ఇలాంటిది మునుపెన్నడూ జరగలేదు. ఇతరుల దృష్టి పడడం కోసం వేరే వాళ్ల వ్యక్తిగత జీవితాలపై సులభంగా ఆరోపణలు ఎలా చేయగల్గుతున్నారు ? సినీతారల పేర్లను ఉపయోగించి, వారి పర్సనల్ లైఫ్ గురించి నిరాధారమైన ఆరోపణలు చేయడం అమర్యాదకరం. హద్దులు దాటి ఓ వ్యక్తి ఇమేజ్ ను దెబ్బతీయడం సహించలేని చర్య. ఒక మహిళా మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇబ్బందికరంగా అనిపించింది” అంటూ ట్వీట్ చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.