Yogi Babu: పవన్ మెచ్చిన కమెడియన్.. యోగి బాబు గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

తాజాగా ఓ తమిళ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన నటుడు యోగి బాబును ప్రశంసించారు. ఆయన నటన తాను చాలా ఇష్టమని.. ఓ సినిమాలో ఆయన విలేజ్ సర్పంచ్ అవుతారు ఆ మూవీని బాగా ఎంజాయ్ చేశాను అని అన్నారు. ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. తాజాగా పవన్ వ్యాఖ్యల పై సోషల్ మీడియా వేదికగా యోగి బాబు స్పందించారు.

Yogi Babu: పవన్ మెచ్చిన కమెడియన్.. యోగి బాబు గురించి ఈ విషయాలు మీకు తెలుసా..
Pawan Kalyan
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 03, 2024 | 1:51 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పదవీబాధ్యతలు చెప్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఓ వైపు రాజకీయాలతో మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్న పవన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ తమిళ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన నటుడు యోగి బాబును ప్రశంసించారు. ఆయన నటన తాను చాలా ఇష్టమని.. ఓ సినిమాలో ఆయన విలేజ్ సర్పంచ్ అవుతారు ఆ మూవీని బాగా ఎంజాయ్ చేశాను అని అన్నారు. ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. తాజాగా పవన్ వ్యాఖ్యల పై సోషల్ మీడియా వేదికగా యోగి బాబు స్పందించారు. పవన్ కళ్యాణ్ కు యోగిబాబు ధన్యవాదాలు తెలిపారు.

యోగిబాబు గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. యోగి బాబు తండ్రి భారత సైన్యంలో పని చేశారు. యోగి బాబు కొంతకాలం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పాఠశాల విద్యను అభ్యసించారు. విజయ్ టీవీలో ప్రసారమయ్యే ‘లొల్లు సబ’ షోలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు యోగి బాబు. ఆయన అసలు పేరు బాబు. అమీర్ దర్శకత్వంలో ‘యోగి’ సినిమాలో నటించి ఫేమస్ అయ్యాక అతని పేరు యోగి బాబుగా మారిపోయింది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన కొలమావు కోకిల చిత్రంలో నటుడు యోగి బాబు కూడా ప్రధాన పాత్రలో నటించారు.

కామెడీ యాక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన యోగి బాబు ఇప్పుడు హీరోగా నటించడం మొదలుపెట్టాడు. హీరోగా మారినప్పటికీ కామెడీ పాత్రలు కూడా చేస్తున్నాడు. యోగి బాబు తమిళంలోనే కాకుండా హిందీ, మలయాళ భాషల్లో కూడా పాన్ ఇండియన్ యాక్టర్‌గా మారారు. స్మాల్ స్క్రీన్‌పై అరంగేట్రం చేసి ఆ తర్వాత వెండితెరపైకి వచ్చాడు యోగబాబు. రజనీ, విజయ్‌లతో మొదలుకొని తమిళ చిత్రసీమలోని పలువురు ప్రముఖ నటీనటుల చిత్రాల్లో హాస్య పాత్రల్లో నటించాడు. విజయ్‌తో ‘మెర్సల్‌’, అజిత్‌తో ‘విశ్వాసం’, రజనీకాంత్‌తో ‘దర్బార్‌’ వంటి అగ్ర కథానాయకుల చిత్రాలలో ప్రధాన హాస్యనటుడిగా యోగి బాబు నటించి మెప్పించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం