Andhra Pradesh: పరస్పర ప్రయోజనాలు. అటు ఏపీకి ఉండాలి.. ఇటు తెలుగు సినీ పరిశ్రమకూ ఉండాలి. జగన్‌తో మీటింగ్ తర్వాత సినీ పెద్దలు, మంత్రి వెల్లడించిన అభిప్రాయాలతో ఇదే సారాంశం కనిపిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమ బతకడానికి ప్రభుత్వం సహకరించాలి. ఆ సహకారం ఎన్ని రకాలుగా ఉండాలన్నదానిపై మొత్తం 17 రకాల అజెండాతో సినీ ప్రముఖులు వెళ్లారు. దానిపై చర్చలు జరిగాయి. ప్రభుత్వం నుంచీ సానుకూల సంకేతాలు వచ్చాయి. అలాగే ప్రభుత్వం కూడా సినీ ప్రముఖుల ముందు కొన్ని కోరికలు ఉంచింది. ఏపీలో సినిమా పరిశ్రమ పెట్టాలి. విశాఖ సహా అవకాశం ఉన్న చోట్ల ఏపీలో షూటింగ్‌లు ఎక్కువగా జరగాలి. అందుకు సినీ ప్రముఖులు కూడా సానుకూలంగా స్పందించారు.
ప్రతీ థియేటర్‌లో ఉదయం 8 నుంచి మొదలై.. రోజంతా 5షోలకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇన్నాళ్లూ తెగకుండా, ముడిపడకుండా ఉన్న టికెట్ రేట్లపైనా ఓ సానుకూల చర్చే జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ 5రూపాయలు టికెట్ ఉన్న నాన్‌ఏసీ థియేటర్‌లో ఇకపై మినిమమ్ 30 రూపాయలు, అత్యధికంగా 70 రూపాయలు ఉండేలా కమిటీ రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక నగర పంచాయతీ అయినా, మున్సిపాలిటీ అయినా,కార్పొరేషన్ అయినా.. మినిమమ్ టికెట్ రేట్ 40, మ్యాగ్జిమమ్ 150 రూపాయల వరకూ ఆస్కారం ఉండబోతోంది. రాబోయే 2 వారాల్లో దీనికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి కూడా అధికారిక ఉత్తర్వులు వచ్చే చాన్స్ ఉంది.
ఏపీలో సినీ పరిశ్రమ పెడితే ఎలాంటి ప్రోత్సహకాలు కావాలో సినీ ప్రముఖులు అడిగారు. సీఎం జగన్ వైపు నుంచి కూడా పరిశ్రమకు తగ్గ రాయితీలు, ప్రోత్సాహకాలు ఉంటాన్న సానుకూలత కనిపించింది.
CM Jagan: ఏపీ సీఎం జగన్ సీరియస్.. అతి చేసినవారికి అక్షింతలు.. పునరావృతం కావొద్దని ఆదేశం