Guntur Kaaram: రచ్చ మొదలైంది.. అక్కడ గుంటూరు కారం బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి..

ఎట్టకేలకు గుంటూరు కారం సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అవ్వడంతో అందుకు తగ్గట్టుగా సినిమాను రెడీ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే గుంటూరు కారం సినిమానుంచి విడుదలైన పోస్టర్స్ , గ్లింప్స్ ఫ్యాన్స్ ను ఉర్రుతలూగించాయి, మహేష్ మాస్ అవతార్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. 

Guntur Kaaram: రచ్చ మొదలైంది.. అక్కడ గుంటూరు కారం బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి..
Gunturukaaram

Updated on: Dec 19, 2023 | 5:17 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న నయా మూవీ గుంటూరు కారం.. ఆతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ అనుకోని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు గుంటూరు కారం సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అవ్వడంతో అందుకు తగ్గట్టుగా సినిమాను రెడీ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే గుంటూరు కారం సినిమానుంచి విడుదలైన పోస్టర్స్ , గ్లింప్స్ ఫ్యాన్స్ ను ఉర్రుతలూగించాయి, మహేష్ మాస్ అవతార్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

గుంటూరు కారం సినిమా నుంచి రెండు పాటలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మొదటి సాంగ్ దమ్ మసాలా సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సెకండ్ సాంగ్ పై కొంతమంది విమర్శలు గుప్పించారు. ఇక ఈ సినిమా రిలీజ్ కు 20 రోజుల సమయం మాత్రమే ఉంది. దాంతో మేకర్స్ స్పీడ్ పెంచారు. త్వరలోనే వరుసగా గుంటూరు కారం సినిమా అప్డేట్స్ ఇవ్వనున్నారు. ఈ సినిమా ట్రైలర్ కోసం మహేష్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే గుంటూరు కారం సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ యూకే లో ఓపెన్ అయ్యాయి. యూకే లోని కొన్ని థియేటర్స్ లో గుంటూరు కారం మూవీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా క్షణాల్లో అమ్ముడయ్యాయి. కొద్దిసేపటిలోనే టికెట్స్ హాట్ కేక్స్ మూవీ టికెట్స్ ఓపెన్ అయ్యాయని తెలుస్తోంది. త్వరలోన్ యూఎస్ లోనూ బుకింగ్స్ ను ఓపెన్ చేయనున్నారట. అలాగే గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్, అలాగే ట్రైలర్ పై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. ఈ సినిమాతో మహేష్ బాబు భారీ హిట్ అందుకోవడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..