Anil Ravipudi : ఆ టైమ్ లో మహేష్ ఎంతో ధైర్యాన్ని ఇచ్చాడు.. రెండు మూడు రోజులకు ఒక్కసారి కాల్ చేసేవాడు..

|

May 21, 2021 | 7:19 AM

సూపర్ స్టార్ ,మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. టాలీవుడ్ వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న అనిల్

Anil Ravipudi : ఆ టైమ్ లో మహేష్ ఎంతో ధైర్యాన్ని ఇచ్చాడు.. రెండు మూడు రోజులకు ఒక్కసారి కాల్ చేసేవాడు..
anil-ravipudi
Follow us on

Anil Ravipudi :

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. టాలీవుడ్ వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న అనిల్.. మొన్నటి వరకు మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేసి విజయాలను అందుకున్నాడు. ఆతర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. సరిలేరు సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ అజయ్ పాత్రలో నటించారు. అలాగే కీలక పాత్రలో సీనియర్ నటి విజయశాంతి కనిపించరు. హీరోయిన్ గా రష్మిక మందన నటించింది. ప్రస్తుతం ఆయన ‘ఎఫ్ 3’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అలాగే మహేష్ తో మరో సినిమా, బాలకృష్ణతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల అనీల్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.ఆతర్వాత కొద్దిరోజులకు ఆయన తిరిగి కోలుకున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ మాట్లాడుతూ.. తనకు కోవిడ్ సోకిందని తెలియగానే మహేష్ బాబు – వెంకటేష్ – వరుణ్ తేజ్ ఫోన్ చేసి పరామర్శించారని  తెలిపాడు. అలాగే ”  “నాకు కరోనా సోకిందని తెలియగానే హోమ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయాను. పుస్తకాలు ఎక్కువగా చదివాను, స్క్రిప్ట్ వర్క్ చేసుకున్నాను. వెంకటేష్ , వరుణ్ తేజ్ ఫోన్ చేసి మాట్లాడారు. ఇక మహేష్ బాబు రెండు మూడు రోజులకు ఒకసారి ఫోన్ చేసి దైర్యం చెప్పారు. తన సరదా మాటలతో అదే పనిగా నవ్వించేవారు. దాంతో నేను మానసిక పరమైన ఒత్తిడిలో నుంచి బయటికి వచ్చేవాడిని. నిజం చెప్పాలంటే నేను కరోనా బారిన పడినప్పుడు, మహేశ్ మాటలు నాపై మందులా పనిచేశాయి”అంటూ చెప్పుకొచ్చాడు అనిల్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Dimple Hayathi: ‘గద్దలకొండ గణేష్’ హీరోయిన్ కుటుంబాన్ని వెంటాడుతున్న కరోనా.. 10 మందికి పాజిటివ్..

యాంకర్ సుమ రిక్వెస్ట్.. ప్లీజ్ అందరికి తెలిసేలా చెయ్యండి.ఇలా చేసి 2 లక్షలు పొందవచ్చు..!:Anchor Suma video.

లాక్‏ డౌన్‏లో రహస్యంగా బిగ్‏బాస్ షో షూటింగ్.. 8 మంది సిబ్బందికి కరోనా… పోలీసుల రాకతో ట్విస్ట్..